Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు

సూర్యాపేట : కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు

రోడ్ల వెడల్పు పనులలో వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.  మార్చి నెలాఖరు కి విస్తరణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

 

మంగళవారం పట్టణంలోని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో యం.జి రోడ్డు తరహాలో అన్ని రోడ్లలో పచ్చదనం మరింత పెంచాలని అలాగే ప్రజా రవాణా వ్యవస్థకు ఎక్కడకూడా ఇబ్బందులు కలగకుండా నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఆదేశించారు.

 

అలాగే పట్టణం లో గల మున్సిపల్ పార్కులలో పారిశుధ్య పనులు చేపట్టి సుందరికరణగా ఉంచాలని సూచించారు. అనంతరం యం.జి రోడ్డు, కోర్టు చౌరస్తా పలు ప్రాంతాలలో రోడ్లను పరిశీలించి సూచనలు, సలహాలు చేశారు.
ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ రామనుజుల రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు