మిర్యాలగూడ : సెయింట్ జాన్స్ పాఠశాలలో.. ఘనంగా బతుకమ్మ పండుగ..!

మిర్యాలగూడ పట్టణంలోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో బతుకమ్మ పండుగ సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. బతుకమ్మలను రంగురంగుల పూలలతో పేర్చి ఆటపాటలతో అలరిచ్చారు. పూలలతో పాఠశాల ఆవరణ హరివిల్లుగా మారింది.

మిర్యాలగూడ : సెయింట్ జాన్స్ పాఠశాలలో.. ఘనంగా బతుకమ్మ పండుగ..!

మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో బతుకమ్మ పండుగ సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. బతుకమ్మలను రంగురంగుల పూలలతో పేర్చి ఆటపాటలతో అలరిచ్చారు. పూలలతో పాఠశాల ఆవరణ హరివిల్లుగా మారింది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మల పండుగ ఆడపడుచుల పడగానే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికగా పండగ నిలుస్తుందన్నారు. తొమ్మిది రోజులు పాటు జరిగే ఈ పండుగ ఆడపడుచులు ఎంతో సంతోషంగా జరుపుకుంటారన్నారు.

ALSO READ : Election : నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు ఇవీ తేదీలు..!

అన్ని పండుగల సాంప్రదాయాలను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష ఉపాధ్యాయులు భవాని, పద్మ, సుజాత, పరమేశ్వరి, నాగలక్ష్మి, నాగిరెడ్డి, వరప్రసాద్, లోకేష్, మల్లికార్జున్, రవి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Viral : మనిషి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుందా.. ఎలా ఉంటుందో తెలిసిపోయింది..!