Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంతెలంగాణ

Election : నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు ఇవీ తేదీలు..!

Election : నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు ఇవీ తేదీలు..!

అభ్యర్థుల, రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చుపై నిరంతరం నిఘా..!

న్యూఢిల్లీ , మన సాక్షి :

దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిసెంబర్ 3వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.

తెలంగాణలో ఒకే విడతలు ఎన్నికలు నిర్వహించనున్నారు నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్ 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 13వ తేదీ వరకు స్క్రూట్ ని, నవంబర్ 15 లోపు నామినేషన్ల విత్ డ్రా, నవంబర్ 30న ఎన్నికల పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు. ఉంటాయని రాజీవ్ కుమార్ తెలిపారు.

అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, రెండు కిలోమీటర్ల లోపునే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు, ప్రతి అభ్యర్థి వివరాలు ఓటర్లకు వెల్లడించాలి, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఖర్చులపై నిరంతరం నిగా ఉంటుంది అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

ALSO READ : నేడు ఎన్నికల షెడ్యూల్.. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..!

తెలంగాణలో ఆరు లక్షల పైగా ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ 679 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గం వర్గాలకు పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో మొత్తం మూడు కోట్ల 17 లక్షల, 17, 389, పురుషులు కోటి 58 లక్షల 71, 483, మహిళలు కోటి 58 లక్షల 43, 339 ఓటర్లు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ గొడవ 2024 జనవరి 16వ తేదీ వరకు ఉన్నది. కాగా ఆలోపే ఎన్నికల కమిషన్ ఎన్నికలను పూర్తి చేయనున్నది.

ALSO READ : మిర్యాలగూడలో 10న కేటీఆర్ పర్యటన.. అధికారులతో ఎమ్మెల్యే కీలక సమావేశం..!

మరిన్ని వార్తలు