Dubbaka : నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు..!

నాసికరం విత్తనాలు నకిలీ విత్తనాలు పంపిణీ చేస్తే డీలర్లపై చర్యలు తప్పవని ఎస్సై గంగరాజు అన్నారు. సోమవారం దుబ్బాక మండల కేంద్రంలోని 6 రైతు విత్తన ఎరువులు డీలర్లకు సమావేశం నిర్వహించారు.

Dubbaka : నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు..!

దుబ్బాక , మన సాక్షి :

నాసికరం విత్తనాలు నకిలీ విత్తనాలు పంపిణీ చేస్తే డీలర్లపై చర్యలు తప్పవని ఎస్సై గంగరాజు అన్నారు. సోమవారం దుబ్బాక మండల కేంద్రంలోని 6 రైతు విత్తన ఎరువులు డీలర్లకు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎరువులు విత్తనాలు పురుగుల మందులను రైతులకు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లకు ఉచ్చరించారు.

నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్సులను రాజు చేస్తామన్నారు. మండలంలో పలు ఫర్టిలైజర్ దుకాణాలను దుబ్బాక, సీఐ శ్రీనివాస్, ఎస్సై గంగరాజు తనిఖీ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని ఫర్టిలైజర్ దుకాణ దారులకు వివరించారు.

ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలన్నారు. నాసిరకం విత్తనాలు అమ్మిన విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సంతోష్ కుమార్, హరీష్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు