Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Groups : గ్రూప్ 3 పరీక్షల స్ట్రాంగ్ రూము వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు.. పరిశీలించిన జిల్లా కలెక్టర్..! 

Groups : గ్రూప్ 3 పరీక్షల స్ట్రాంగ్ రూము వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు.. పరిశీలించిన జిల్లా కలెక్టర్..! 

నల్లగొండ, మన సాక్షి :

గ్రూప్- 3 పరీక్షల స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదేశించారు. అక్కడ భద్రపరిచిన ప్రశ్నాపత్రాలు ,ఇతర కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.

ఈ మేరకు శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్ .జి. కళాశాలలో ఏర్పాటుచేసిన గ్రూప్- 3 పరీక్షల స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ,కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ భద్రతపై ఆర్ సి ఓ లు, చీఫ్ సూపరింటెండెంట్ లకు సూచనలు చేశారు.

చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షల నిర్వహణ విషయమై ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.  .ఆదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్, ఆర్ డి ఓ అశోక్ రెడ్డి, నల్గొండ డి.ఎస్.పి శివరామిరెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు