సమాజ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర – సీఐ నవీన్ కుమార్

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అభ్యాస్ హై స్కూల్ విద్యార్థులు.

సమాజ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర – సీఐ నవీన్ కుమార్

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అభ్యాస్ హై స్కూల్ విద్యార్థులు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

నవ సమాజ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర అని
భావి తరాలు వారివేనని రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ సీఐ నవీన్ కుమార్ అన్నారు. విద్యార్థుల ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ను స్ధానిక అభ్యాస్ హైస్కూల్ విద్యార్థులు స్టేషన్ ను సందర్శించారు. విద్యార్థులకు పోలీస్ స్టేషన్ మరియు పోలీసుల విధుల గురించి అవగాహన కల్పించిన పట్టణ సిఐ నవీన్ కుమార్ నవ సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

ఈ క్రమంలో చదువుపట్ల ఆసక్తి పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, చేడు అలవాట్లు .. సోషల్ మీడియాకు దూరంగా ఉండి సమయం వృధా చేయకుండా చదువు పట్ల ఆసక్తిని పెంచుకోవాలని హితబోధ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ..

విద్యార్థుల ప్రాజెక్టు వర్క్ లో భాగంగా పట్టణంలోని రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్, బస్ స్టేషన్, బ్యాంకులు ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాలు వాటి సేవలు, పనితీరు గురించి విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వారు పేర్కొన్నారు.

విద్యార్థులకు ఎంతో ఓపికగా ఎన్నో విషయాలు విషయదీకరించిన పోలీసు అధికారి నవీన్ కుమార్ తదితరులకు పాఠశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రంలో ప్రిన్సిపాల్ ఉమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ సంగీత, స్కూల్ డైరెక్టర్లు మధుసూదన్, రెహమాన్, శశికాంత్, వినోద్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.