Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైన సూర్యాపేట విద్యార్థులు..! 

Suryapet : రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైన సూర్యాపేట విద్యార్థులు..! 

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా చదరంగ సమాఖ్య సంయుక్తంగా కోదాడ పబ్లిక్ క్లబ్ లో నిర్వహించిన చదరంగ పోటీల్లో రాడికల్ చెస్ అకాడమీ బాలబాలికలు సత్తా చాటారు.

ఈ పోటీల్లో 200 మందికి పైగా పాల్గొనగా 20 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 20 మందిలో ఆరుగురు సూర్యాపేట బాల బాలికలు కావడం విశేషం.

అండర్ 17 బాలికల విభాగంలో ఇందిరా ప్రధమ రమ్య ద్వితీయ లిప్సిక శివాని తృతీయ నాలుగో స్థానంలో లు నా తన్వీర్, అండర్ 14 బాలికల విభాగంలో శృతిక, అండర్ 14 బాలుర విభాగంలో మహేశ్వరి దీక్షిత్ రాష్ట్ర స్థాయి చదరంగ పోటీలకు ఎంపికైనట్లు వారికోచి ఎడవెల్లి అనిల్ కుమార్ తెలిపారు.

వీరిని ఎస్జిఎఫ్ సూర్యాపేట అధికారి అజాం బాబా గారు మరియు పారుపల్లి చంద్రశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు. వీరు 9, 10వ తేదీల్లో మేడ్చెల్ లో జరిగే రాష్ట్రస్థాయి చదరంగ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు