Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా

BIG BREAKING : ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా..!

BIG BREAKING : ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా..!

రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పట్టుకున్న అధికారులు

రూ.19,200 లతోపాటు రైటర్ల నుంచి రూ.లక్ష 72వేలు స్వాధీనం

మహబూబాబాద్, మన సాక్షి ప్రతినిధి

మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఏసీబీ అధికారులకు చిక్కారు. రిజిస్ట్రేషన్ విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.19200 లు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. శుక్రవారం ఏసీబీ అధికారులు డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.లక్ష 72వేలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

రూ. 19, 200లతో పట్టుబడ్డ తస్లీమా : 

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఎకరం 28గుంటల భూమిని కొనుగోలు చేసి అందులో నుంచి నాలా పర్మిషన్తో ప్లాట్లును రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మార్చి మొదటి వారంలో వచ్చాడు. గజానికి రూ.108 రూపాయలు ప్రభుత్వధర ఉండగా, రిజిస్ర్టేషన్ కార్యాలయ సిబ్బంది మాత్రం గజానికి రూ.150ల చొప్పున చెల్లించాలని సూచించారు.

ALSO READ : Drugs : డ్రగ్ కేసులో పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు

ప్రభుత్వ ధరకంటే ఎక్కువ ఇవ్వడం ఇష్టం లేక వరంగల్ లోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను మళ్లీ వచ్చి కలిసి రిజిస్ట్రేషన్ చేయాలని అడిగారు. అయితే వెంకటేష్ అనే అతన్ని కలవాలని, పూర్తి వివరాలు తెలుపుతాడని హరీష్కు వివరించారు.

హరీష్ 128గజాలకు గాను రూ.150ల చొప్పున ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టు కున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. తస్లీమా మహ్మద్, ఆలేటి వెంకటేష్ లను అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరుచనున్నట్లు వివరించారు. హరీష్ ఇచ్చిన రూ.19200లతో పాటు రూ.లక్ష72వేలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు ఎ.శ్యాం సుందర్, ఎస్.రాజు, సిబ్బంది ఉన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన పనిచేసేందుకు లంచం అడిగితే 1064 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.

ALSO READ : ED : కవిత అరెస్టుపై ఈడి కీలక ప్రకటన విడుదల..!

మరిన్ని వార్తలు