Suicide : తీవ్ర విషాదం.. రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య..!
రైలు కిందపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేస్తుంది.

Suicide : తీవ్ర విషాదం.. రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య..!
మన సాక్షి, హైదరాబాద్ :
రైలు కిందపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబాబాద్ జిల్లా జిన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన రవికుమార్ (32) శిరీష (28) భార్యాభర్తలు. వీరు కొంతకాలం క్రితం జీవనోపాధి కోసం హైదరాబాదుకు వచ్చారు. హయత్ నగర్ సమీపంలోని కుంట్లూరులో నివాసం ఉంటున్నారు. అయితే గురువారం రాత్రి వీరిద్దరూ బీబీనగర్ రైల్వే మార్గంలోని ఎన్ఎఫ్సీ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమవుతమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా..? మరి ఏదైనా కారణం ఉందా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇవి కూడా చదవండి 👇
- TS News : ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకటో తేదీనే జీతాలు..!
- Mangoes : మామిడి పండ్ల చరిత్ర తెలుసా.. ఏ పండ్లు ఎలా తింటే ఆరోగ్యమో తెలుసుకుందాం..!
- Miryalaguda : జిల్లాలో 20వేల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్.. పరిశీలించిన అధికారులు..!
- WhatsApp : వాట్సాప్ ఇక నుంచి ఫ్రీ కాదు.. నెలకు రూ. 79 చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసుకుందాం..!









