Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : చలో ఇందిరా పార్క్ ధర్నాను విజయవంతం చేయాలి..!

జూలై 5న "మాల చలో ఇందిరా పార్క్" ధర్నాకు భారీగా తరలిరావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి పిలుపునిచ్చారు.

Miryalaguda : చలో ఇందిరా పార్క్ ధర్నాను విజయవంతం చేయాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

జూలై 5న “మాల చలో ఇందిరా పార్క్” ధర్నాకు భారీగా తరలిరావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి పిలుపునిచ్చారు. మిర్యాలగూడలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026 జూలై 5వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే “మాల చలో ఇందిరా పార్క్” మహాధర్నాకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి మాల సోదర సోదరీమణులు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

మాలలకు అమలవుతున్న రోస్టర్ పాయింట్ విధానంలో ఒక్క ఉద్యోగం కూడా సక్రమంగా దక్కడం లేదని, ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు తీవ్రంగా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం మాలలకు రావాల్సిన ఉద్యోగాలు, అవకాశాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ మంచాల లింగస్వామి, దాసరి విశాల్, ఆవుల సుధీర్, బాలనాగమ్మ అన్ని మాల సంఘాల ఆధ్వర్యంలో “మాల చలో ఇందిరా పార్క్” ధర్నాను విజయవంతం చేయాలని, ప్రతి మాల కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.

ఈ విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ముల్లంగిరి కాంతయ్య, షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు బొప్పని నగేష్, మాల మహానాడు రాష్ట్ర కమిటీ సభ్యులు చిలుకూరి అభినవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు