వేములపల్లి : రావులపెంట వాసి దొంతిరెడ్డి సుమన్ రెడ్డి కి ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డు
వేములపల్లి : రావులపెంట వాసి దొంతిరెడ్డి సుమన్ రెడ్డి కి ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డు
వేములపల్లి , మే 3, మన సాక్షి :
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన దొంతిరెడ్డి సుమన్ రెడ్డి కి ఉత్తమ ఫోటో జర్నలిస్టు అవార్డు లభించింది. హై బిజ్ మీడియా అవార్డ్స్-2023 లో హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి అవార్డును అందజేశారు.
దొంతిరెడ్డి సుమన్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా ద టైమ్స్ ఆఫ్ ఇండియా లో సీనియర్ ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయ,జాతీయ, రాష్ట్రంలో జరిగిన ఫోటో కాంపిటీషన్లో పలు అవార్డులు అందుకున్నారు.
2013 వ సంవత్సరంలో దిల్ సుఖ్ నగర్ లో జరిగిన జంట పేలుళ్ల సమయంలో తీసిన ఫోటోలు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రథమ బహుమతి ఇవ్వడం జరిగింది.
2016 లో ఇంటర్నేషనల్ ఇమేజ్ కొలీగ్ ఆఫ్ అమెరికా వారి నుండి ఫోటోగ్రఫీలో చెందిన గౌరవప్రదమైన డాక్టరేట్ ను కూడా పొందారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ హై బిజ్ మీడియా సంస్థ వారు మీడియా రంగానికి చెందిన జర్నలిస్టులను గుర్తించి వారికి అవార్డులు ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం అని అన్నారు.
అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో నాలుగు స్తంభాలలో మీడియా కూడా ప్రధానమైనదని మీడియా వారు అక్షరాన్ని అమ్ముకోవద్దు అని నిజాన్ని నిర్భయంగా రాయండి అని కోరారు. ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న హై బిజ్ వ్యవస్థాపకులు రాజగోపాల్ కి వారి సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.









