వడదెబ్బకు గురై గ్రామ సేవకుని మృతి

వడదెబ్బకు గురై గ్రామ సేవకుని మృతి
వలిగొండ , మన సాక్షి:
వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో వడదెబ్బకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన పులిగిల్ల గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచి బిక్షపతి (69) గత మూడు రోజుల క్రిందట వడదెబ్బకు గురి కావడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందడం జరిగింది.
కంచి బిక్షపతి గత 40 సంవత్సరాలుగా పులిగిల్ల గ్రామ సేవకునిగా (వీఆర్ఏ) పనిచేస్తూ ఉన్నారు. ఆయన గ్రామ ప్రజలకు అందించిన సేవలను ఈ సందర్భంగా గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు.
ఈయన గ్రామ సేవకునిగా పని చేస్తున్న కాలంలో ఎందరో సర్పంచులు మారుతున్న కూడా తాను ప్రతి ఒక్క సర్పంచ్ కి తన సేవలను అందించారు.ప్రతిరోజు ఉదయాన్నే గ్రామపంచాయతీ వద్దకు వచ్చి తన విధులు నిర్వర్తించుకొని ఇంటికి వెళ్లేవాడని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జక్కా వెంకట్ రెడ్డి తెలియజేశారు.
ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి…👇
- Govt Job : నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 81 వేల జీతం..!
- Whatsapp Multi Account : వాట్సప్ అదిరిపోయే మల్టీ ఎకౌంటు ఫీచర్..!
- RRB Recruitment : 10th అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. ఈనెలాఖరులోగా దరఖాస్తులు..!
- GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !
- WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!