Miryalaguda : ప్రతి రైతు మద్దతు ధర, రూ. 500 బోనస్ పొందాలి..!
Miryalaguda : ప్రతి రైతు మద్దతు ధర, రూ. 500 బోనస్ పొందాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ప్రతి రైతు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సన్నధాన్యం విక్రయించుకొని మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా పొందాలని కాంగ్రెస్ కిసాన్ విభాగం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి కోరారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న రైతు వేదికలో ఏ డి ఏ దేవిసింగ్ తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరి పంట పొలాలు కోసిన తర్వాత కోయకాలను కాలపెట్టరాదని తెలిపారు. దాని వలన భూమిలో భూసారం తగ్గిపోతుందని కాబట్టి రైతులందరూ కూడా తగలపెట్టవద్దని వరి పైరు వేసేటప్పుడు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు చేయాలన్నారు. రైతులు వరి ధాన్యాన్ని ఐకేపి సెంటర్ లో విక్రయించి మద్దతు బాటు ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ వస్తుందని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరి విత్తనాలు ఎవరైనా కల్తి విత్తనాలు ఆమ్మినట్లయితే వారి పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహబూబ్ అలి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, మండల నాయకులు సారెడ్డి శంకర్ రెడ్డి, కంచుగట్ల లింగయ్య యాదవ్, ఎ ఓ సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
-
Viral Video : రీల్స్ పిచ్చి.. ప్రమాదం కూడా గుర్తించని మహిళ.. (వీడియో)
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బంది సస్పెన్షన్..!
-
PI Phone : ఇంటర్నెట్, చార్జింగ్ అవసరం లేని స్మార్ట్ ఫోన్.. డిసెంబర్ లో లాంచ్, తెగ వైరల్..!









