సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, మన సాక్షి

జర్నలిస్టులపై జరుగుతున్న వేధింపులు దాడుల విషయంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరపాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ  కోరారు.

శనివారం కల్వకుర్తి పట్టణంలో ఫిబ్రవరి 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాదిగ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అవినీతి అక్రమ భూ కబ్జాలపై వార్తలు రాస్తున్న వర్కింగ్ జర్నలిస్టులపై అక్రమార్కులు బెదిరింపులు దాడులు నిత్య కృత్యమవుతున్నాయని అన్నారు. జర్నలిస్టులపై దాడులు చేసే వారిని చట్టపరంగా శిక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు .

ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రాజేందర్, సీనియర్ జర్నలిస్టులు వెంకటయ్య, నాగేష్, రాజన్న, రామచంద్రయ్య, కరుణాకర్ ,ఉపేందర్, కృష్ణ ,శేఖర్ ,నాని తదితరులు పాల్గొన్నారు.