Suryapet : సూర్యాపేట జిల్లాలో డీసీఎం బీభత్సం.. ఒక లారీని, ఒక కారును, మహిళను ఢీకొన్న వాహనం..!
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గుండాల మిట్ట ప్రాంతంలో డి సి ఎం బీభత్సం సృష్టించింది.

Suryapet : సూర్యాపేట జిల్లాలో డీసీఎం బీభత్సం.. ఒక లారీని, ఒక కారును, మహిళను ఢీకొన్న వాహనం..!
గరిడేపల్లి, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గుండాల మిట్ట ప్రాంతంలో శుక్రవారం డి సి ఎం బీభత్సం సృష్టించింది. బొగ్గు లారీని, ఒక హోంగార్డుకు చెందిన కారును ఢీకొంది. లారీని ఢీకొంటంతో డీసీఎం ఒకవైపు భాగం నుజ్జు నుజ్జు అయింది. మద్యం మత్తులో ఉన్న డీసీఎం డ్రైవర్ దానిని ఆపకుండా మితిమీరిన వేగంతో ఒకవైపు డీసీఎం డోర్ భాగాలు కింద వేలాడుతూ ఉన్నప్పటికీ వెళ్లడంతో మార్గమధ్యంలో తుమ్మాయిగడ్డ ప్రాంతంలో రమణమ్మ అనే మహిళకు డీసీఎంకు వేలాడుతున్న ఇనుప కడ్డీలు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి.
ఎవ్వరు ఆపే ప్రయత్నం చేసిన ఆపకుండా మితిమీరిన వేగంతో డీసీఎం డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రిపోర్టర్ వెంటనే నేరేడుచర్ల ఎస్సై సైదిరెడ్డికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్ఐ సైదిరెడ్డి వెంటనే స్పందించి తమ సిబ్బందిని నాలువైపులా పంపించి కాపలా ఉంచారు.
నేరేడుచర్ల పట్టణం శివారులో ఉన్న బైపాస్ రోడ్డు కి మళ్ళిన డీసీఎంను గంగమ్మ గుడి వద్ద పోలీసు సిబ్బంది భారీకేడ్ లు అడ్డం పెట్టడంతో డీసీఎం ను డ్రైవర్ ఆపాడు. వెంటనే పోలీస్ సిబ్బంది డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని డీసిఎంను డ్రైవర్ను గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అప్పచెప్పారు. సకాలంలో నేరేడుచర్ల ఎస్ఐ సైదిరెడ్డి, పోలీస్ సిబ్బంది స్పందించడంతో మరో ప్రమాదం జరగకుండా డీసీఎంను పట్టుకోవడం జరిగింది. లేకుంటే మరికొన్ని ప్రమాదాలు జరిగి ఉండేవి.









