Suryapet : రూ. 4.80 కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ..!
ప్రజల భద్రత, రక్షణలో నిరంతరం పోలీసు కృషి చేస్తుందని గడిచిన సంవత్సర కాలంలో14 విడతలుగా 1846 మొబైల్స్ రికవరీ చేసి ఇచ్చామని వాటి విలువ సుమారు 4 కోట్ల 80 లక్షల ఉంటుందని ఎస్పీ కే నరసింహ అన్నారు.

Suryapet : రూ. 4.80 కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ..!
సూర్యాపేట మనసాక్షి :
ప్రజల భద్రత, రక్షణలో నిరంతరం పోలీసు కృషి చేస్తుందని గడిచిన సంవత్సర కాలంలో14 విడతలుగా 1846 మొబైల్స్ రికవరీ చేసి ఇచ్చామని వాటి విలువ సుమారు 4 కోట్ల 80 లక్షల ఉంటుందని ఎస్పీ కే నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు 20 లక్షల రూపాయల విలువ గల 102 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు (భాదితులకు) అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటే నష్టాలు తప్పవని,అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అత్యాశకు పోయి, ఆదమరిచి ఉన్నా సైబర్ మోసగాళ్లు ఆర్థిక నష్టం కలిగిస్తారని, సాంకేతికత అభివృద్ధి చెందినదని అదే స్థాయిలో సైబర్ మోసాలు రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి వీటిని తగ్గించాలంటే అవగాహన అప్రమత్తతా ఒకటే మార్గం అన్నారు. సమాజంలో మంచిని సమర్థించాలి చెడును ప్రశ్నించాలి అప్పుడే మన భావితరాలకు ఆరోగ్య వంతమైన సమాజాన్ని అందించగలుగుతాం అన్నారు.
ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు నమోదు చేసుకోవాలని,మొబైల్ ను బ్లాక్ చేసి, మీ సేవా ద్వారా ధరఖాస్తు సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసు శాఖ కృత నిశ్చయంతో పని చేసి పెద్దమొత్తంలో ఫోన్ లు రికవరీ చేసి ఇక్కడ భాదితులకు అందించడం జరిగినది అన్నారు.
అత్యాశకు పోవద్దు
ప్రజలు అత్యాసకు పోయి సైబర్ మోసాల బారిన పడోద్దు తక్కువ వడ్డీకి లోన్స్ ఉన్నాయి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, బహుమతులు వచ్చాయి అంటే నమ్మి అపరిచితులకు డబ్బులు పంపవద్దు అని వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని , మీ పిల్లలు డ్రగ్స్, అమ్మాయిల రవాణా లాంటి కేసుల్లో చిక్కుకున్నారు డిజిటల్ అరెస్ట్ చేస్తాం అని సిబిఐ , సి ఐ డి లాంటి దర్యాప్తు సంస్తల పేర్లు చెప్పి డబ్బులు కడితే కేసు నుండి తప్పిస్తాము అంటారు ఇది నమ్మవద్దు డిజిటల్ అరెస్ట్ అబద్దం అన్నారు.
రోడ్డు ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించార. హెల్మెట్ పెట్టుకోకవడం వలన, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో సంబంధించిన ప్రాణా నష్టం గురించి వివరించారు. డ్రగ్స్ కు మన పిల్లలు అలవాటు పడి ఈ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని మన సమాజం నుండి గంజాయి నీ ప్రారదొరాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది అన్నారు.
పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపిన మొబైల్స్ పొందిన బాధితులు :
పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీ కి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటి కోర్ సిబ్బంది, పోలీస్ సైబర్ వారియర్స్, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు.










