Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Suryapet : పిఎసిఎస్ ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి..!

సిఫార్సు మేరకు రైతులు ఎరువులు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మున్సిపల్ పరిధిలో ని పిల్లలమర్రి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి పిఎసిఎస్ తనిఖీ చేశారు.

Suryapet : పిఎసిఎస్ ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి..!

సూర్యాపేట రూరల్, మనసాక్షి :

సిఫార్సు మేరకు రైతులు ఎరువులు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మున్సిపల్ పరిధిలో ని పిల్లలమర్రి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి పిఎసిఎస్ తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. యూరియా అమ్మకాలు రైతులకు ఏ విధంగా జరుగుతుందని రైతులను అడిగి వివరాలు తెలుసుకొన్నారు.

సూర్యాపేట మండలం నందు రైతులకు సరిపడా యూరియా ఉందని రైతులు అవసరానికి మించి ఎరువులు తీసుకోరాదన్నారు.యాసంగి 2025 సీజన్ కు ప్రస్తుతం జిల్లాలో 10508 మె.ట. యూరియా రైతులకు సరఫరా చేయుటకు వివిద సొసైటీలు,డీలర్లు, ఎన్ డి సి ఎం ఎస్, ఆరస్క్ మార్కుఫెడ్ గోధాంలలో అందుబాటులో ఉందని తెలిపారు. ఈ రోజు వరకు 32910 మె.ట యూరియా రైతులకు పంపిణీ చేయటం జరిగిందన్నారు.

యాసంగి 2025 సీజన్ కు గాను సూర్యాపేట జిల్లాలోని రైతులకు సకాలంలో ఎరువులు, సరఫరా చేయుట సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచేవిధంగా ప్రభుత్వం అన్ని కేంద్రాల్లో యూరియా నిల్వలను ఉంచుతుదన్నారు. జిల్లాలో ఈ యాసంగి 2025 సీజన్ కు సరిపడిన అన్నీ ఎరువులు అందుబాటులో ఉన్నట్లుగా నిర్ధారించనైనది.రైతులకు సకాలంలో యూరియా అందజేయుటకు అన్నీ రకాల ఏర్పాట్లు చేయటం జరిగిందని జిల్లాలో 544 సెంటర్ ల ద్వారా యూరియా పంపిణీ చేయుటకు ఏర్పాట్లు చేశామన్నారు.

కావున రైతులు ఎవ్వరూ ఆందోళన చెందల్సిన అవసరం లేదని అవసరానికి తగ్గట్టుగా సకాలంలో యూరియా పంపిణీ చేయుటకు అన్నీ ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్, పిఎసిఎస్ సిబ్బంది వెంకన్న,రైతులు శివరాత్రి బుచ్చి రాములు, బీరెల్లి రామచంద్ర రెడ్డి, వెంకట్ రెడ్డి, లింగస్వామి పాల్గొన్నారు.

MOST READ NEWS 

  1. Mutton Boti : మటన్ బోటి కర్రీ తినడం మంచిదేనా.. వీరు తినకూడదు..!

  2. WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

  3. Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!

మరిన్ని వార్తలు