Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట డిఎస్పి సీరియస్ హెచ్చరిక.. ప్రైవేట్ పాఠశాలల్లో అలా చేస్తే చట్టపరమైన చర్యలు..!

ప్రవేట్ విద్యాసంస్థల ను సంఘాల పేరుతో ఇబ్బందులు, బెదిరింపులకు గురి చేస్తున్నారని వివిధ సమస్యలపై ప్రవేట్ విద్యాసంస్థల నుండి పిర్యాదు వస్తున్నాయని అలాంటి వారి పైన చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ ఒక ప్రకటన లో హెచ్చరించారు. 

Suryapet : సూర్యాపేట డిఎస్పి సీరియస్ హెచ్చరిక.. ప్రైవేట్ పాఠశాలల్లో అలా చేస్తే చట్టపరమైన చర్యలు..!

సూర్యాపేట, మనసాక్షి :

ప్రవేట్ విద్యాసంస్థల ను సంఘాల పేరుతో ఇబ్బందులు, బెదిరింపులకు గురి చేస్తున్నారని వివిధ సమస్యలపై ప్రవేట్ విద్యాసంస్థల నుండి పిర్యాదు వస్తున్నాయని అలాంటి వారి పైన చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ ఒక ప్రకటన లో హెచ్చరించారు.

ఈసందర్బంగా ఆయన గురువారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో ని త్రివేణి పాఠశాల లోకి కొంత మంది వ్యక్తులు విద్యార్థి సంఘాల పేరుతో అక్రమంగా చొరబడి కార్యాలయం తాళాలు పగలగొట్టి, పెద్దగా నినాదాలు చేస్తూ విద్యార్థులను భయాందోళనకు గురిచేసిన విషయమై యాజమాన్యం పిర్యాదు మేరకు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు చట్టపరకారం క్రిమినల్ కేసు నమోదు చేశామని చెప్పారు.

విద్యార్థి సంఘాల పేరుతో విద్యార్థులకు అసౌకర్యం కలిగించవద్దని విద్యాసంస్థల యాజమాన్యాలను, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయవద్దు అని వివిధ రకాల సంఘాలకు సూచించారు. పాఠశాలల్లో, విద్యాసంస్థల్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం, విద్యార్థులను రవాణా చేసే బస్సులను అడ్డుకోవడం, యాజమాన్యాలను లేదా ఉపాధ్యాయులను బెదిరించడం, పెద్ద శబ్దాలతో నినాదాలు చేస్తూ విద్యార్థులు భయపడేలా వాతావరణం సృష్టించడం, చందాల రూపంలో డబ్బు వసూళ్లు చేయడం వంటి చర్యలకు పాల్పడడం చట్ట విరుద్ధం అని అన్నారు.

ప్రవేటు విద్యాసంస్థల్లో ఏవైనా సమస్యలు ఉంటే, వాటిపై సంబంధిత జిల్లా అధికారులకు, విద్యాశాఖ అధికారులకు పిర్యాదు చేయాలని , సమస్యలపై అధికారులు నిబంధనల ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంతే కానీ, విద్యార్థి సంఘాల పేరు చెప్పుకుని పాఠశాలల్లో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించవద్దని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తూ వారికి అసౌకర్యం కలిగించకూడదని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విద్యాసంస్థల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తుల పైన కేసులు నమోదు చేయడం,బైండోవర్ చేయడం లాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు