Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించేవరకు పోరాటం..!

సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు పోరాటం ఆగదని సూర్యాపేట రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్ధన్, కో కన్వీనర్ రాచూరి ప్రతాప్ ,డాక్టర్.రమేష్ చంద్ర గౌరవ సలహాదారులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు.

Suryapet : సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించేవరకు పోరాటం..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు పోరాటం ఆగదని సూర్యాపేట రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్ధన్, కో కన్వీనర్ రాచూరి ప్రతాప్ ,డాక్టర్.రమేష్ చంద్ర గౌరవ సలహాదారులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ గ్రాండ్ ఎదురుగా ఉన్న కార్యాలయం వద్ద రైల్వే మార్గం మరియు సూర్యపేట మీదుగా హైస్పీడు రైల్ కోసం ప్రజా పిలుపు కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ల

ఇప్పటికే రైల్వే సౌకర్యం కొరకు ప్రజా సంఘాలు, సామాజిక శక్తులతో, మేధావులతో, సూర్యాపేట ప్రగతిని కాంక్షించే వారితో కమిటీ వేశామని రైల్వే సాధన సమితి ని ఏకతాటిగా తీసుకొచ్చి రైల్వే సౌకర్యం సాధించేవరకు కొరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. సూర్యాపేట ప్రజలు సంఘీభావం తెలిపి రైల్వే సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైల్వే సాధన కొరకు సంతకాల సేకరణ కూడా నిర్వహించామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో రైల్వే సాధన సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రంగారెడ్డి, గౌరవ సలహాదారులు లింగంపల్లి భద్రయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తలమల్ల హస్సేన్, డాక్టర్ రమేష్ చంద్ర, మామిడి అంజయ్య, బికుమల్ల ఉపేందర్, నల్లపాటి అప్పారావు, తొగిటి మురళి, నల్లకుంట్ల అయోధ్య, రిటైర్డ్ టీచర్ నరసయ్య, సముద్రాల రాంబాబు, మంజుల, తోట శ్యాంప్రసాద్,పోతరాజు నరసయ్య, నారబోయిన వెంకట యాదవ్, ఎర్ర అఖిల్, అక్కినపల్లి రాము, రాచూరి సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు