Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : జంక్షన్ లకు ఆధునిక సొభగులు

పేట జంక్షన్ లకు ఆధునిక సొభగులు

మారనున్న సూర్యాపేట పట్టణ రూపు రేఖలు

అబ్బురపరిచేలా ముఖ ద్వార జంక్షన్

మున్సిపల్ కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు చేసిన మంత్రి

సూర్యాపేట పట్టణం లోని ఎన్టీఆర్ జంక్షన్, ఈనాడు జంక్షన్ లను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి

ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశం

సూర్యాపేట , మనసాక్షి :

2014 తరువాత అభివృద్ది లో దూసుకు పోతున్న సూర్యాపేట జిల్లా కేంద్రం నూతన శోభను సంతరించుకోనుంది.. ప్రధాన జంక్షన్ లను మరింత గా విస్తరించి , ఆధునీకరించడం కోసం 2కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఈ మేరకు సూర్యాపేట పట్టణం లోని ఎన్టీఆర్ పార్క్, పి. ఎస్. ఆర్ సెంటర్, ఈనాడు జంక్షన్, రాఘవ ప్లాజా జంక్షన్ లను సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం రాత్రి స్వయంగా పరిశీలించారు.

జంక్షన్ ల ఆధునీకరణ పై మున్సిపల్ అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సమీపం లోని ఎన్టీఆర్ పార్క్ చౌరస్తా సూర్యాపేట ముఖ ద్వారం కాబట్టి విశాలంగా సృజాత్మకత ఉట్టి పడేలా జంక్షన్ ను తీర్చిదిద్దాలని కోరారు.. జంక్షన్ ల ఆధునీకరణ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు.వారి వెంట మున్సిపల్ అధికారులు , బి ఆర్ ఎస్ నాయకులు ,ప్రజాప్రతినిధులు ఉన్నారు.

మరిన్ని వార్తలు