క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. ట్రాక్టర్ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి..!
సూర్యాపేట జిల్లాలో విషాద సంఘటన జరిగింది. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామం వద్దట్రాక్టర్ పై నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందాడు.

Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. ట్రాక్టర్ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి..!
తుంగతుర్తి, మన సాక్షి :
సూర్యాపేట జిల్లాలో విషాద సంఘటన జరిగింది. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామం వద్దట్రాక్టర్ పై నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నాగారం మండలం ఈటూరు లో ఆదివారం గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం.. ఈటూరు గ్రామానికి చెందిన బొబ్బిలి లింగస్వామి (33) గ్రామం నుంచి ఎస్సారెస్పీ కాల్వ వద్దకు ట్రాక్టర్ పై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు జారి ట్రాక్టర్ పైనుంచి కిందపడ్డాడు. దీంతో లింగస్వామి తలకు బలమైన గాయం కావడంతో అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృ తిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఉష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాగారం ఎస్ఐ చిరంజీవి తెలిపారు.









