సూర్యాపేట : సువెన్ ఫార్మా కంపెనినీ సీజ్ చేయాలి

సూర్యాపేట : సువెన్ ఫార్మా కంపెనినీ సీజ్ చేయాలి

కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి

సూర్యాపేట,  మనసాక్షి:

సువెన్ ఫార్మని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ…

 

సువెన్ ఫార్మని 1989 లో జాస్తి వెంకటేశ్వరరావు కోటి రూపాయల పెట్టుబడితో 10 ఎకరాల్లో విస్తరించి ఇక్కడ వచ్చిన లాభాలతో ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాలలో అనేక ఫార్మా కంపెనీలు స్థాపించాడు అన్నారు.అమాయక గిరిజనుల వద్ద ఒక లక్ష నుండి 3లక్షలకు ఎకరం కొని 100 ఎకరాలు చేసి ఆ కంపెనీని 650కోట్లకు విదేశి కంపెనీకి అమ్ముకొని అమాయక గిరిజనులను మోసం చేశాడనీ విమర్శించారు.

 

ALSO READ : Rythu Runa Mafi : రుణమాఫీ పై కేసీఆర్ కీలక ప్రకటన అప్పుడేనా..?

 

2018 నుండి మరో కొత్త ప్లాంట్ ఓపెన్ చేయాలనీ చూస్తున్నారు ఇది పొరపాటున బ్లాస్ట్ అయితే చుట్టూ 10 కిలో మీటర్లు స్మశానం అవుతుంది అన్నారు. దీనితో పాటు ఇక్కడ ఉన్న భూమి, నీరు, గాలి కాలుష్యం వల్ల ఇక్కడ పండే పంటలు కలుషితమై ఇక్కడి ప్రజలు కిడ్నీ, ఊపిరితిత్తులు మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు.

 

కాబట్టి జాస్తి వెంకటేశ్వర రావు కి లాభం 650 కోట్లలో 325కోట్లు కంపెనీ వల్ల నష్ట పోయిన కుటుంబాలకు ఇవ్వాలి, తక్షణమే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా సువెన్ ఫార్మా కంపెనినీ సీజ్ చేయాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.

 

ALSO READ : Wifi : మీ వైఫై రూటర్ 24 గంటలు ఆన్ లోనే ఉంచుతున్నారా..? అయితే ఇది చూడాల్సిందే ..!

 

ఈ కార్యక్రమం లో పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్ యు రాష్ర్ట సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, ఐ ఎఫ్ టి యుయు జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రాంజీ, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ,

 

సహయ కార్యదర్శి సంతోషి మాతా, ఐఎఫ్ టి యు జిల్లా నాయకులు జీవన్, వాజీద్, వీరబాబు, పిడిఎస్ యు నాయకులు సింహాద్రి,మానస, శైలజ,పద్మ,పుష్ప, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.ధర్నా అనంతరం ఏవో శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు.