ప్రజల మధ్యలో నేడు రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం.. మంత్రులు వీరే..!

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ముందే చెప్పినట్లుగా ప్రజల మధ్యలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో భారీ జన సందోహం మధ్య రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రజల మధ్యలో నేడు రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం.. మంత్రులు వీరే..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ముందే చెప్పినట్లుగా ప్రజల మధ్యలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో భారీ జన సందోహం మధ్య రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు అధికారులన్నీ ఏర్పాటు చేశారు.

ప్రమాణ స్వీకారానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకారున్నారు. వీరితోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ , తెలంగాణ పార్టీ వ్యవహారాలు ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే , కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

ALSO READ: Revanth Reddy : సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం.. మారిన ముహూర్తం..!

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలంతా రావాలని రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు స్వాగతం పలకడంతో పాటు వారికి ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో 25వేల మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బయట ఉండే వారు కూడా వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.

6 గ్యారంటీ లపై సంతకం :

ప్రమాణ స్వీకారం అయిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలపై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి సంతకం పెట్టే అవకాశాలు ఉన్నాయి. వాటి విధివిధానాల ఆధారంగా ఎప్పటినుంచి అమలు చేస్తారని అధికారులు ఆపద కాలపై స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన తొలి హామీని ప్రమాణస్వీకారం రోజే అమలు చేసేందుకు ఆ పార్టీ చర్యలు చేపట్టనున్నది.

ALSO READ : Free Travel : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఏర్పాట్లు.. ఇవి రూల్స్..!

మంత్రులుగా : 

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తో పాటు పలువురు మంత్రులు కూడా ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. మంత్రుల జాబితాను కూడా రాజ్ భవన్ కు రేవంత్ రెడ్డి పంపినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క , మంత్రులుగా సీతక్క, ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!