Curd : వేసవిలో పెరుగు తియ్యగా గట్టిగా ఉండాలంటే సింపుల్… ఇలా చేస్తే చాలు..!
Curd : వేసవిలో పెరుగు తియ్యగా గట్టిగా ఉండాలంటే సింపుల్… ఇలా చేస్తే చాలు..!
మనసాక్షి వెబ్ డెస్క్:
పెరుగు అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా అరుదు. పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ,శరీర పుష్టికి మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. కానీ పుల్లటి పెరుగు చాలా మంది ఇష్టపడరు. అందుకని వేసవిలో పెరుగు కమ్మగా, గట్టిగా రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం….
ఎక్కువ శ్రమ లేకుండా తయారు చేయగలిగే పదార్థం పెరుగు ఒకటే. మరిగించిన పాలలో గోరువెచ్చగా ఉన్న సమయంలో మజ్జిగ చుక్కలను వేస్తే పాలు గట్టిగా తోడుకుంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుంచి వెన్న, నెయ్యి , మీగడ తీయవచ్చు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తీయగా ఉంటుంది. తోడు ఎక్కువైతే పుల్లగా ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ .. తెలియని విషయం ఇంకా ఉంది.
పెరుగు వేసవిలో ఎక్కువ పులుపు వస్తుంది. పులుపు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం…
పచ్చిమిర్చితో పెరుగు:
ముందుగా పాలను వేడి చేయాలి. ఆ తర్వాత పెరుగు చేయాలనుకునే పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గిన్నెలో పోయాలి. గోరువెచ్చని పాలలో కొంచెం పెరుగు తోడు పెట్టి ఒక పచ్చిమిర్చి వేయాలి. అయితే మిరపకాయ కాడ తప్పక ఉంచాలి. మిర్చి పూర్తిగా పాలలో మునగాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాలను ఆరు గంటల పాటు వెచ్చని ప్రదేశంలోనే ఉంచాలి. మీ పాలు పెరుగు అవుతుంది. ఇలా చేసిన పెరుగు తీయగా గట్టిగా ఉంటుంది. పాలు తోడుకొని పెరుగు అయినా తర్వాత అప్పుడు చల్లగా ఉండేందుకు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.
నిమ్మకాయతో పెరుగు :
నిమ్మకాయతో పెరుగు చేయడానికి మీకు గోరువెచ్చని పాలు అవసరం ఉంటుంది. మీరు రెండు టీ స్పూన్ల నిమ్మరసం పిండాలి. గోరువెచ్చని పాలలో వేయాలి. తర్వాత పాలను ఆరు నుంచి ఏడు గంటలు మూత పెట్టి గోరువెచ్చని ప్రదేశంలోనే ఉంచాలి. అలా చేయడం వల్ల పెరుగు గట్టిగా అవుతుంది. తీయగా ఉంటుంది. గట్టిగా అయిన పెరుగును ఫ్రిజ్ లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్స్ మీరు కూడా ట్రై చేయండి.










