చింతపల్లి : బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి

చింతపల్లి : బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి
చింతపల్లి. మనసాక్షి.
వేసవి కావడంతో బావిలో కి ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడిన సంఘటన చింతపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండలం బొగ్గుల దోన గ్రామానికి చెందిన వేముల రాజు 18 సంవత్సరాలు గత రెండు రోజుల క్రితం చింతపల్లి మండలం కేంద్రంలోని తన మేనమామ అయిన కోమే ర తిరుపతయ్య ఇంటికి చుట్టూ చూపుగా వచ్చాడు.
ALSP READ : Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!
అయితే వేసవి కావడంతో సరదాగా స్నానం చేసేందుకు చింతపల్లి మండల కేంద్రానికి సమీపంలో గల వర్గాల ఇదం బావిలో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. సంఘటన విషయం తెలుసుకున్న పోలీసులు బావి వద్దకు చేరి సంఘటన విషయాలు సేకరించారు.
శవాన్ని బావిలో నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు వేముల రాజు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ : Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!