TATA AIA : సంపద వృద్ధి, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం రెండు కొత్త ఫండ్స్‌ను ఆవిష్కరించిన టాటా ఏఐఏ..!

TATA AIA : సంపద వృద్ధి, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం రెండు కొత్త ఫండ్స్‌ను ఆవిష్కరించిన టాటా ఏఐఏ..!
ముంబై:
ప్రపంచలోనే 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగే క్రమంలో, దేశంలోనే దిగ్గజ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా ఆధారిత పెట్టుబడి సాధనాల ద్వారా మీరు మీ సంపదను పెంచుకోవడానికి, భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. భారత్ పటిష్టమైన ఆర్థిక వృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో సంపదను పెంచుకునేందుకు అపార అవకాశాలు లభిస్తున్నాయి. భారతదేశ వృద్ధి గాథతో లబ్ధి పొందేందుకు, ఆ అవకాశాలను మీరూ అందిపుచ్చుకునేందుకు ఈ రెండు కొత్త ఫండ్స్ ఉపయోగపడగలవు.
భారత ఆర్థిక పురోగతి ప్రయోజనాలను మీరు పూర్తిగా పొందడంలో తోడ్పడేలా ఈ రెండు కొత్త ఫండ్లు రూపొందించబడ్డాయి:
1. కుటుంబం యొక్క ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా చేస్తూ, తమ సంపదను పెంచుకోవాలని భావిస్తున్న వారి కోసం – టాటా ఏఐఏ టాప్ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ ఫండ్
2. ఈక్విటీ ఆధారిత వృద్ధితో పటిష్టమైన రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవాలని భావిస్తున్న వారి కోసం – టాటా ఏఐఏ టాప్ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ పెన్షన్ ఫండ్
ఈ రెండు ఫండ్ల ఆఫర్ వ్యవధి 2025 జూన్ 23న ప్రారంభమై 2025 జూన్ 30న ముగుస్తుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్‌వో) వ్యవధిలో ఒక్కో యూనిట్ రూ. 10కే లభిస్తుంది. ఇటు జీవిత బీమా కవరేజీ అటు సంపద వృద్ధి అవకాశాలను అందించేలా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ద్వారా నిధులు ఇన్వెస్ట్ చేయబడతాయి.
ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే..
3. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుతో ప్రయోజనాలు పొందడం యువ వర్క్‌ఫోర్స్, పట్టణీకరణ, పటిష్టమైన పాలసీ సంస్కరణలు, ‘మేక్ ఇన్ ఇండియా’ – పీఎల్ఐలాంటి ప్రత్యేక పథకాలు మొదలైన అంశాల దన్నుతో భారత్ అధిక వృద్ధి సాధించనుంది. ఆ వృద్ధి ఫలాలను పొందే అవకాశాలను ఈ ఫండ్స్ కల్పిస్తాయి.
4 అత్యుత్తమమైన వాటిలో ఇన్వెస్ట్ చేయండి మార్కెట్‌కి మించి రాబడులను అందించిన చరిత్ర ఉన్న (ఆల్ఫా) 30 టాప్-పర్ఫార్మింగ్ స్టాక్‌లను ఎంపిక చేసే నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ ఆధారితమైనవిగా ఈ ఫండ్స్ ఉంటాయి. స్టాక్స్ ఎంపిక స్మార్ట్‌గా ఉండటం వల్ల అధిక వృద్ధికి ఆస్కారం ఉంటుంది.
5. దీర్ఘకాలిక సంపద సృష్టికి అనువు మీ కుటుంబం కోసం ఆర్థికంగా పటిష్టమైన పునాది వేయాలనుకున్నా లేదా రిటైర్మెంట్ ఫండ్‌ను తయారు చేసుకోవాలనుకున్నా ఈ ఫండ్స్ ఉపయోగకరంగా ఉంటాయి. అత్యంత నాణ్యమైన ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కాలక్రమేణా మీ సంపద పెరిగేందుకు దోహదపడతాయి.
6. జీవిత బీమా భద్రత: కేవలం సంపద సృష్టికే పరిమితం కాకుండా, వినియోగదారులు లైఫ్ కవరేజీ ద్వారా తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కూడా ఇవ్వగలరు.
ఈ ధోరణులను అందిపుచ్చుకుని, భారత వృద్ధి గాధతో ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా టాటా ఏఐఏ టాప్ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ ఫండ్, టాటా ఏఐఏ టాప్ 200 ఆల్ఫా 30 పెన్షన్ ఫండ్ తీర్చిదిద్దబడ్డాయి. మీరు సంపదను పెంచుకోవాలనుకున్నా లేక పటిష్టమైన రిటైర్మెంట్ ఫండ్‌ను ఏర్పర్చుకోవాలనుకున్నా ఈ ఫండ్‌లు పనితీరు, భద్రత, వృద్ధిపరంగా చక్కని మేళవింపుతో ప్రయోజనాలను చేకూరుస్తాయి.
“భారత్ ప్రస్తుతం పరివర్తనాత్మకమైన బహుళ దశాబ్దాల ఆర్థిక వృద్ధి దశ ముంగిట్లో ఉంది. దీని ద్వారా ఒనగూరే ప్రయోజనాలను అందిపుచ్చుకునే విధంగా మా కొత్త ఫండ్స్ ఉంటాయి. విస్తృతమైన డేటా అనాలిసిస్ దన్నుతో, రిస్కులకు అనుగుణంగా అత్యుత్తమ రాబడులను అందించే ఈక్విటీ సాధనాలుగా ఇవి నిలుస్తాయి. ఆర్థిక భద్రతను నిలకడగా పెంపొందిస్తూ దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు గణనీయమైన ప్రయోజనాలను అందించగలవు” అని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ హర్షద్ పాటిల్ తెలిపారు.
ఫండ్స్ ముఖ్యాంశాలు:
• పెట్టుబడి లక్ష్యం: హై-ఆల్ఫా స్టాక్స్‌లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలంలో మూలధన వృద్ధి
• బెంచ్‌మార్క్: నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్
• అసెట్ అలొకేషన్: ఈక్విటీ & ఈక్విటీ సంబంధిత సాధనాల్లో 80%-100%, క్యాష్ & మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో 0%-20%
కస్టమర్లు ఎలాంటి ప్రయోజనాలు ఆశించవచ్చంటే:
* మార్కెట్‌కి మించిన లాభాలిచ్చే షేర్లలో పెట్టుబడి: మార్కెట్ అంచనాలకు మించిన పనితీరు కనపర్చడంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశం.
* స్మార్ట్ డైవర్సిఫికేషన్: మంచి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతూ విభిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం.
* దీర్ఘకాలిక సంపద సృష్టి: దీర్ఘకాలికంగా అత్యుత్తమ పనితీరుతో రిటైర్మెంట్ ప్లానింగ్‌కి అనువుగా తీర్చిదిద్దబడిన సాధనాలు.
టాప్ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి
వినియోగదారులు ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావొచ్చు. టాటా AIAకి చెందిన వివిధ సొల్యూషన్స్‌తో ఈ ఫండ్ లభిస్తుంది. వీటిలో టాటా AIA పరమ్ రక్షా లైఫ్ గ్రోత్ +, టాటా AIA పరమ్ రక్షా లైఫ్ ప్రో, టాటా AIA పరమ్ రక్షా లైఫ్ ప్రో +, టాటా AIA పరమ్ రక్షా లైఫ్ మ్యాక్సిమా +, టాటా AIA పరమ్ రక్షా లైఫ్ అడ్వాంటేజ్ +, టాటా AIA ప్రో ఫిట్, టాటా AIA శుభ ముహూర్త్ మరియు టాటా AIA శుభ ఫార్చ్యూన్ ఉన్నాయి.
టాప్ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ పెన్షన్ ఫండ్‌లో పెట్టుబడి:
టాప్ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ పెన్షన్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ప్రత్యేకంగా టాటా AIA యొక్క యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్ అయిన స్మార్ట్ పెన్షన్ సెక్యూర్ ప్లాన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు గల శక్తివంతమైన రిటైర్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
రూఢీగా నిరూపితమైన టాటా AIA ఫండ్ల పనితీరు
టాటా AIA ఫండ్లు స్థిరంగా మార్కెట్ బెంచ్‌మార్క్‌లకు మించి మెరుగైన లాభాలను అందిస్తూ వస్తున్నాయి. కంపెనీ ఫండ్ AUMలో 99.93%కు పైగా ఫండ్లకు (5 ఏళ్ల ప్రాతిపదికన) ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మార్నింగ్‌స్టార్ నుంచి 4 లేదా 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇది ఇండస్ట్రీ సగటు కంటే అధికం. మార్కెట్‌లో 4 లేదా 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్ల AUM వాటా సాధారణంగా 30 శాతానికన్నా కూడా తక్కువగా ఉంటుంది.
నిరంతరంగా మెరుగైన పనితీరు కనపర్చడమనేది, భారతదేశపు వర్ధమాన ఆర్థిక పరిస్థితులకు అనుగుణమైన పెట్టుబడి సాధనాలను అందించడంలో, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా ఇన్వెస్టర్లకు సాధికారత కల్పించడంలో టాటా ఏఐఏకి గల నిబద్ధతను సూచిస్తుంది.









