Teachers : ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్.. పాటాలు బోధించని ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలి..!

ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరుకాకుండా వాలంటీర్లు పెట్టుకొని నడిపిస్తున్నారని, జీతాలు తీసుకునే నెల చివర రెండు, మూడు రోజులు మాత్రమే హాజరవుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ కంభంపాటి శంకర్ ఆరోపించారు.

Teachers : ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్.. పాటాలు బోధించని ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలి..!

దేవరకొండ, మనసాక్షి:

ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరుకాకుండా వాలంటీర్లు పెట్టుకొని నడిపిస్తున్నారని, జీతాలు తీసుకునే నెల చివర రెండు, మూడు రోజులు మాత్రమే హాజరవుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, కంభంపాటి శంకర్ ఆరోపించారు. శుక్రవారం
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో చందంపేట మండలంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ తెల్లవారి పల్లి గ్రామం బాపన్ మోట్ తండా, జగన్ నాయక్ తండాలో విద్యార్థులు 16మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పని చేయాల్సిన ప్రధానోపాధ్యాయుడు జీతాలు చేసే నెల చివరి రెండు మూడు రోజుల్లో మాత్రమే వచ్చి సంతకాలు పెట్టుకొని పోవడం జరుగుతుంది.

ఇక్కడ ఒక వాలంటరీని పెట్టుకుని విద్యార్థులకు సరైన విద్యాబోధన అందించకుండా కాంప్లెక్స్ హెడ్మాస్టర్, చందంపేట మండలం ఎంఈఓ లను చేతిలో పెట్టుకొని పాఠశాలలకు రాకుండా మేనేజ్ చేసుకుంటున్న బాపట్ మెట్, జగన్ తండాలో ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ పాఠశాలలో 8 మంది విద్యార్థులు హాజరైనారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కానీ మరియు పెట్టిన వాలంటరీ గాని విధులకు హాజరు కాకపోవడంతో మారుమూల ప్రాంతాలలో ఉన్న గిరిజన తండాలలో విద్యార్థులు మాకు ఏ ఉపాధ్యాయుడు వచ్చి పాటలు చెప్తారా అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి తెల్దార్ పల్లి గ్రామం‌ లో బాపన్ మెట్ జగన్ తండాలో విద్యార్థుల పరిస్థితి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు మూసి వేయకూడదని మూతబడిన పాఠశాలలను తిరిగి తెరిపించాలని ఉద్దేశం అన్ని రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించి మారుమూల గిరిజన తండాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఆలోచిస్తుంటే ఇలాంటి బడికి బడిపంతులను ప్రోత్సహిస్తున్న కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ను మరియు చందంపేట ఎంఈఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

గుడి తండాలో ఒక ఉపాధ్యాయురాలును అక్రమ డిప్యూటేషన్ల పంపించి గుడి తండలో పాఠశాల మూసివేతకు కారణమైన ఎంఈఓ డిప్యూటేషన్ ఇవ్వాలంటే ఆ పాఠశాలలో విద్యార్థులు లేకపోతే ఆ కాంప్లెక్స్ పరిధిలో గాని మండల పరిధిలో గాని డిప్యూటేషన్ ఇవ్వాలి కానీ విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి డబ్బులకు ఆశపడి ఇక్కడ ఉపాధ్యాయురాలిని మిర్యాలగూడ అవంతిపురం పాఠశాలకు డిప్యూటేషన్ ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు.

తక్షణమే నల్గొండ జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి వీరి పైన సమగ్ర విచారణ జరిపించాలని మండల విద్యాధికారిగా ఒక గిరిజన అధికారి ఉంటే గిరిజన విద్యార్థుల బతుకులు బాగుపడతాయని ఆలోచిస్తున్న గిరిజన విద్యార్థుల పట్ల శాపంలా మారిన మండల విద్యాధికారి ఎంఈఓ ను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని లేని పక్షంలో భారత విద్యార్థి పేడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షా కార్యదర్శులు రమావత్ లక్ష్మణ్ నాయక్, బుడిగ వేంకటేష్ తదితరులు పాల్గొన్నారు