ఉపాధ్యాయుడికి బడిత పూజ

ఉపాధ్యాయుడికి బడిత పూజ

కంగ్టి, సిర్గాపూర్, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండల కేంద్రంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడికి ఆ గ్రామస్తులు బడిత పూజ చేశారు . సిర్గాపూర్‌ జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ లో పి ఈ టిగా విధులు నిర్వర్తిస్తున్న సంగ్రం అదే స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై దుర్భాషలాడి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేసింది.

 

విద్యార్థిని తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం స్కూలుకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడికి వివరణ అడుగుతుండగా పి ఈ టి అంతలోనే రావడంతో తల్లిదండ్రులు అడుగుతుండగా పొంతన లేని మాటలు చెప్పుండడంతో బావోఉద్రిక్తకు లోనైన విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేవాశుద్ధి చేశారు.

 

ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి…👇

 

విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. అసభ్యంగా ప్రవర్తించిన పిటి సార్‌ కి మరియు ప్రధానోపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉపాధ్యాయుడిని మాకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

 

గ్రామన్తులు మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురై కీచకునికి దేవాశుద్ధి చేశారు. ఇలాంటి సంఘటన జరగడం సమాజానికే సిగ్గుచేటు అని తెలిపారు.