Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి..!
తెలంగాణలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు.

ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య భర్తతోపాటు కుమారుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.









