Telangana : ఇందిరమ్మ ఇళ్ల పథకంకు వారే అర్హులు.. ఎంపిక విధానం ఇలా..!
Telangana : ఇందిరమ్మ ఇళ్ల పథకంకు వారే అర్హులు.. ఎంపిక విధానం ఇలా..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను ముందుగా అమలు చేస్తుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ఆయన తొలి సంతకం కూడా ఆరు గ్యారెంటీలను అమలు చేసే ఫైల్ పైన సంతకం చేశారు. నాటి నుంచి నేటి వరకు కూడా పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుంది.
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో గూడు లేని వారందరికీ ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల సహాయం అందజేయనున్నది. ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు సహాయం చేయడంతో పాటు ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలం తో పాటు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది.
ALSO READ : Yadagirigutta : యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు..!
ఇందిరమ్మ ఇంటికి అర్హులు వారే :
👉 లబ్ధిదారులు (బిపిఎల్) దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారై ఉండాలి.
👉 రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
👉 లబ్ధిదారుడికి సొంతంగా ఖాళీ స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం ఇచ్చిన స్థలం అయిన ఉండాలి.
👉 గుడిసె, గడ్డితో పైకప్పును నిర్మించుకున్న ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లు ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
👉 అద్దె ఇంట్లో ఉంటున్న వకరు అర్హుల
👉 వివాహమైన ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా.. లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు.
👉 ఒంటరి మహిళ, వితంతు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చును.
👉 లబ్ధిదారుడు గ్రామం గాని లేదా మున్సిపాలిటీ పరిధిలో గాని ఉండాలి.
ALSO READ : BREAKING : మైనర్ బాలికపై వేధింపులు.. ఫోక్సో కేసు నమోదు..!
ఎంపిక విధానం :
ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదనే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. గ్రామ వార్డు సభలలో ఆమోదం పొందిన తరువాతనే లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ ఎంపిక చేస్తారు.
లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామ సభలో జాబితాను ప్రదర్శించిన తర్వాత సమీక్షించి ఫైనల్ గా నిర్ణయిస్తార
జిల్లా ఇన్చార్జి మంత్రిని సంప్రదించిన తర్వాత జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు.
జిల్లాలో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాదులో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కిచెన్ బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి.
ఆర్ సి సి రూప్ తో ఇంటిని నిర్మించాలి.
లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత జాబితాను గ్రామ లేదా వార్డు సభలలో ప్రదర్శిస్తారు.
ALSO READ : BREAKING : మిర్యాలగూడ లో ఘోరం.. రైస్ మిల్లు గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి..!
డబ్బుల మంజూరు ఎలా :
♦️ ఇంటి నిర్మాణం చేసుకోవడానికి మంజూరైన తర్వాత దశలవారీగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది.
♦️ మొట్టమొదటిసారిగా బేస్మెంట్ స్థాయిలో లక్ష రూపాయలు మంజూరు చేస్తారు.
♦️ పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో మరో లక్ష రూపాయలు అందజేస్తారు.
♦️ పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండు లక్షలు మంజూరు చేస్తారు.
♦️ మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో లక్ష రూపాయలు మంజూరు చేస్తారు.
♦️ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి పూర్తిగా ఐదు లక్షల రూపాయలు జమ అవుతాయి.










