విచిత్ర వేషధారణతో ప్రజల్లో చైతన్యం.. దేనికోసమో తెలుసా..!
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ప్రతి ఆదివారం జరిగే వారసంత సందర్భంగా డ్రగ్స్, గంజాయి, రోడ్డు భద్రతపై వినూత్న రీతిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు రాచకొండ ప్రభాకర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

విచిత్ర వేషధారణతో ప్రజల్లో చైతన్యం.. దేనికోసమో తెలుసా..!
నకిరేకల్, మనసాక్షి
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ప్రతి ఆదివారం జరిగే వారసంత సందర్భంగా డ్రగ్స్, గంజాయి, రోడ్డు భద్రతపై వినూత్న రీతిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు రాచకొండ ప్రభాకర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ విచిత్ర వేషధారణలో వచ్చి ప్రజలకు అవగాహన కల్పించారు.
గంజాయి, డ్రగ్స్, ధూమపానం, పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు సేవించడం వల్ల శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక నష్టాలు కలుగుతాయని, వాటికి దూరంగా ఉండి తమను తాము రక్షించుకోవాలని కోరారు. యువత ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా కష్టపడి లక్ష్యాన్ని సాధించి సమాజానికి, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రతి ఒక్కరూ క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం పనికిరాదని సూచించారు. “నో డ్రగ్స్ – సేవ్ లైఫ్” అంటూ కరపత్రాలు పంచుతూ మైక్ సెట్, ఫ్లెక్సీ ద్వారా అవగాహన కల్పించారు. మరుగున పడుతున్న జానపద కళలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.