TET Result : టెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..!
ఉపాధ్యాయ కొలువులకు అర్హత సాధించే అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను సోమవారం విడుదల చేసింది.

TET Result : టెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..!
మన సాక్షి, హైదరాబాద్ :
ఉపాధ్యాయ కొలువులకు అర్హత సాధించే అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఫలితాల లింకును వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,15, 028 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు 23,623 మంది, ఇతరులు 91,045 మంది ఉన్నారు. వారిలో మొత్తం 50,054 మంది అభ్యర్థులు (43.94% ) అర్హత సాధించారు. ఫలితాల కోసం ఈ లింకును https://tgtet.aptonline.in
క్లిక్ చేయండి.
కమ్యూనిటీ వారిగా అర్హత సాధించిన వారిలో
బీసీ అభ్యర్థులు 40.36%
ఎస్టి అభ్యర్థులు 51.03%
ఈ డబ్ల్యూ ఎస్ 22.43%
జనరల్ అభ్యర్థులు 20.5%
ఈ పరీక్షలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించారు. వీరితో పాటు పేపర్ 1 పరీక్ష రాసిన నలుగురు ట్రాన్స్ జెండర్ లో ఇద్దరు అర్హత సాధించారు.









