తెలంగాణBreaking NewsTOP STORIESజిల్లా వార్తలునల్గొండ

TG : ఐఐఎం కలకత్తా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ గా తిప్పర్తి వాసి..!

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన ప్రొఫెసర్ జగదీష్ కుమార్ ను ప్రతిష్టాత్మకమైన ఐఐఎం కలకత్తా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

TG : ఐఐఎం కలకత్తా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ గా తిప్పర్తి వాసి..!

తిప్పర్తి, మన సాక్షి:

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన ప్రొఫెసర్ జగదీష్ కుమార్ ను ప్రతిష్టాత్మకమైన ఐఐఎం కలకత్తా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో నాలుగు సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు కొనసాగనున్నారు.

ఇతను మారుమూల గ్రామమైన తిప్పర్తి మండలం లోని మామిడాల గ్రామంలో 1960 సంవత్సరంలో మామూలు కుటుంబంలో జన్మించి ఇంటర్ డిగ్రీ వరకు నల్గొండ జిల్లాలోనే పూర్తిచేసుకుని ఐఐటి మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఎమ్మెస్ మరియు పిహెచ్డి పట్టా పొందారు.

గతంలో ఇతడు ఐఐటి ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా, అనంతరం జే ఎన్ యు వైస్ ఛాన్స్లర్ గా 2016 నుండి 2022 వరకు 2022 నుండి 2025 వరకు యుజిసి చైర్మన్ గా బాధ్యతలు కొనసాగించారు. ప్రొఫెసర్ గా విద్యకు చేసిన విశిష్ట కృషికి ఫలితంగా ఇటీవల పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఐఐఎం కలకత్తా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా ఎన్నిక కావడంతో తిప్పర్తి మండలానికి చెందిన వారు కావడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు