TOP STORIESBreaking Newsతెలంగాణవిద్యహైదరాబాద్

TG : ఇక స్కూల్లోనే 12వ తరగతి వరకు..!

తెలంగాణలో విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ విద్యా కమిషన్ నివేదిక ఆధారంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురానున్నారు. దాంతో ఇక పాఠశాల విద్యలోనే 12వ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది.

TG : ఇక స్కూల్లోనే 12వ తరగతి వరకు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ విద్యా కమిషన్ నివేదిక ఆధారంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురానున్నారు. దాంతో ఇక పాఠశాల విద్యలోనే 12వ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది.

రాబోయే విద్యా సంవత్సరం నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రీ ప్రైమరీ టు ప్లస్ టు విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ విద్యా విధానం ఇప్పటికే అమలులో ఉంది. పదవ తరగతి తర్వాత డ్రాప్ అవుట్స్ పెరుగుతున్న కారణంగా ఈ విధానం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలి లో మీడియా మాట్లాడుతూ తెలంగాణ విద్యా విధానంలో విద్యా కమిషన్ సిఫారసులు ఫైనల్ కాదని, ఆ నివేదికను అధ్యయనం, విస్తృత అభిప్రాయ సేకరణ కోసం కేశవరావు కమిటీకి అప్పగించామని తెలిపారు. ఎవరికైనా, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ కమిటీకి చెప్పుకోవాలని సూచించారు. కేశవరావు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దానిని అమలు చేయాలా? వద్దా.? అనేది తాము నిర్ణయిస్తామని తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు