Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking News

యువతకు ఉగాది కానుక.. 10 వేల ఉద్యోగాల శుభవార్త..!

రాష్ట్ర యువతకు ఉగాది పర్వదినం సందర్భంగా 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం ఆనందదాయకమని రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ముదివేడు చెందిన షేక్ అయూబ్ బాషా పేర్కొన్నారు.

యువతకు ఉగాది కానుక.. 10 వేల ఉద్యోగాల శుభవార్త..!

కురబలకోట, మన సాక్షి :

రాష్ట్ర యువతకు ఉగాది పర్వదినం సందర్భంగా 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం ఆనందదాయకమని రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ముదివేడు చెందిన షేక్ అయూబ్ బాషా పేర్కొన్నారు. ప్రెస్ మీట్‌లో ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో యువగళం పాదయాత్రలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలను సమగ్రంగా గుర్తించిన లోకేష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేయడం అభినందనీయమన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగుల్లో కొత్త ఆశలు నింపిందన్నారు.

ఇది కేవలం ప్రారంభమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు, విస్తృత స్థాయిలో ఉద్యోగ కల్పన ద్వారా రాష్ట్ర యువత భవిష్యత్తును మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అయూబ్ బాషా ధీమా వ్యక్తం చేశారు. యువత గళాన్ని ఆలకించి, వారి ఆశయాలను నెరవేర్చే నాయకుడు నారా లోకేష్ మాత్రమేనని కొనియాడారు.

ఉగాది సందర్భంగా నిరుద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపిన ఈ నిర్ణయం పట్ల కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా యువత సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న లోకేష్‌కు రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు పూస మోహన్ రెడ్డి, తెలుగు యువత నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు