District collector : జీవితానికి తొలిమెట్టు అదే, ఆ సమయంలోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!
District collector : జీవితానికి తొలిమెట్టు అదే, ఆ సమయంలోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!
సూర్యాపేట, మనసాక్షి ;
జీవితానికి తొలిమెట్టు పదవ తరగతి నుండి మొదలవుతుందని జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని దానికనుగుణంగా నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ అన్నారు. బుధవారం సాయంత్రం సూర్యాపేట పట్టణంలోని గిరి నగర్ లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, హనుమాన్ నగర్లో గల గవర్నమెంట్ హైస్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
ముందుగా గిరి నగర్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఓపి రిజిస్టర్ను పరిశీలించి, వచ్చిన ప్రతి పేషెంట్కు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారా సుష్మాను అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ చాంపిల్స్ అన్నింటిని టీ హబ్ కు రెగ్యులర్గా పంపుతున్నారా రిజిస్టర్ లో నమోదు చేస్తున్నారా అని పరిశీలించారు .డెంగ్యూ ,మలేరియా కేసుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఇమినైజేషన్ చేస్తున్న తీరును ఏఎన్ఎం సువర్ణను అడిగారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులను జాగ్రత్తగా పరిశీలించి మందులు అందజేయాలని తెలిపారు. అక్కడ నుండి హనుమాన్ నగర్ లో గల గవర్నమెంట్ హై స్కూల్ ను సందర్శించారు, స్టాఫ్ రూమ్ లో గల అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించి పాఠశాలలోని అన్ని గదులను పరిశీలించారు.
9వ తరగతిలో జరుగుతున్న డ్రాయింగ్ క్లాసులు నందు కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. క్లాసులో ఉన్న డ్రాయింగ్ టీచర్ సత్యంను డ్రాయింగ్ లో మెలకువలను పిల్లలకు నేర్పాలని తెలిపారు. అక్కడనుండి 10వ తరగతి గదిని పరిశీలించారు, విద్యార్థులతో కలెక్టర్ బాగా చదివి అందరూ 10/10 పొందాలని డిక్టేక్షన్ మార్కులు సాధించాలని కలెక్టర్ సూచించారు.
పదవ తరగతి నుండే జీవితానికి తొలిమెట్టు మొదలవుతుందని ఇక్కడే జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు వై ఎథిపతి రావు, టీచర్ ఎండి గౌస్ ,మెడికల్ ఆఫీసర్ శివప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ సుష్మ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని ముఖ్యమైన వార్తలు :
Srisailam : శ్రీశైలం వద్ద అధికారుల హై అలర్ట్.. భారీగా పెరిగిన వరద ఉధృతి.. Latest Update
Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!
క్యూసెక్కులు అంటే ఏమిటి.. నీటి ప్రవాహాన్ని అలా ఎందుకు కొలుస్తారు..!
Viral : విచిత్ర దొంగ.. దొంగతనానికి వస్తే ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీ వద్ద ఆవేదన..!









