Crime News : ప్రమాదవశాత్తు చెరువులో మునిగి విద్యార్థి మృతి..!

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం పల్లె తండకు చెందిన మాజీ వార్డు సభ్యుడు కేతావత్ సేవా నాయక్ కుమారుడు కేతావత్ చరణ్ (14) శనివారం సాయంత్రం స్నేహితులతోకలిసి సరదాగా చెరువులోకి చేపల వేటకు వెళ్లాడు.

Crime News : ప్రమాదవశాత్తు చెరువులో మునిగి విద్యార్థి మృతి..!

రంగారెడ్డి జిల్లా, మాడ్గుల,మన సాక్షి:

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం పల్లె తండకు చెందిన మాజీ వార్డు సభ్యుడు కేతావత్ సేవా నాయక్ కుమారుడు కేతావత్ చరణ్ (14) శనివారం సాయంత్రం స్నేహితులతోకలిసి సరదాగా చెరువులోకి చేపల వేటకు వెళ్లాడు.

చేపల వేటకు వెళ్లిన చరణ్ చెరువులోని నీళ్లల్లోకి దిగగా ప్రమాదవశాత్తు బురదలో చిక్కుకొని చెరువులో మునిగాడు. ఇది గమనించిన తోటి స్నేహితులు కేకలు వేస్తూ సమీప పొలాల్లోని రైతులను పిలిచారు. అక్కడకు చేరుకున్న రైతులు, సమీప తండావాసులు నీటిలో మిగిలిన కేతావత్ చరణ్ ను చెరువు నీటిలో నుంచి బయటకు తీశారు.

ప్రథమ చికిత్స కోసం నల్గొండ జిల్లా దేవరకొండ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తీసుకెళ్లాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు చరణ్ ను హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.

మృతుడు కేతావత్ చరణ్ ప్రస్తుతం మాడ్గుల లోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం సెలవు దినం కావడంతో చరణ్ సరదాగా తోటి స్నేహితులతో చెరువు వద్దకు వెళ్లి మృత్యువాత పడడంతో పల్లె తండాలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి.

ALSO READ : BRS, BSP : తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై మాయావతి సంచలన ప్రకటన.. ఆర్ఎస్పి ట్వీట్..!