Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

Khammam : మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

Khammam : మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

ఖమ్మం, మనసాక్షి :

ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో మున్నేరు వరద ప్రవాహం పెరుగుతున్న నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి అన్నారు.
మొంథా తూఫాను ప్రభావంతో మున్నేరు నది పరివాహక ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తల కోసం బుధవారం ఖమ్మం నగరంలోని కాల్వఒడ్డు, మున్నేరు ఘూట్, గణేష్ నిమర్జన ఘూట్, బొక్కలగడ్డ, ఖమ్మం రూరల్ మండలంలోని జలగంనగర్, కేబీఆర్ నగర్, గ్రీన్ కాకతీయనగర్ తదితర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ అభిషేక్ ఆగస్త్య తో కలిసి పర్యటించారు.

మున్నేరు బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని, నీటిమట్టం స్థాయిని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్నేరు పరిసర ప్రాంతాలు బొక్కలగడ్డలో స్ధానిక ప్రజలతో కలెక్టర్ ముచ్చటిస్తూ, భారీ వర్షాలతో ఎగువ జిల్లాల నుండి మున్నేరు వరద పెరుగుతున్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని, అధికారులకు సహకరించాలని, వరద ఎప్పటికప్పుడు గమనించుకోవాలని సూచించారు.

మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ అత్యవసర సమయంలో ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్లో 1077, 9063211298 మొంథా తూఫాను ప్రభావంతో ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకి వరద ముప్పు పెరుగుతుందని, ప్రస్తుతం ఖమ్మం వద్ద మున్నేరు 17 అడుగుల మేర ప్రవహిస్తోందని మరో రెండు అడుగులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని తెలిపారు.

అదేవిధంగా అధికారులకు ఎగువ నుండి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చర్యలు చేపట్టాలి ముప్పుకు గురి అయ్యే ప్రాంతాలను గురించి ఆయా ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాల ఏర్పాటు చేయాలి అధికార,యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నామని,ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రజలు అనవసరంగా ముంపు ప్రాంతాల్లో తిరగవద్దని కోరారు.

వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో పూర్తి సంసిద్ధతతో స్థానికంగా ఉంటూ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. నీటిపారుదల, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు క్షేత్రస్ధాయిలో ఎప్పటికప్పుడు నీటిమట్టం అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

వరద పెరిగే అవకాశం ఉన్నందున మున్నేరు నది, బ్రిడ్జి ల పైకి ప్రజలు అనవసరంగా రావద్దని, ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస రెడ్డి, ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ అనిల్ కుమార్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, మున్సిపల్, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. District collector : అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రజలకు సూచన.. మొంథా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..!

  2. Big Alert : మరో మూడు గంటల్లో తెలంగాణలో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో అలర్ట్..!

  3. Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!

  4. Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!

మరిన్ని వార్తలు