క్రైంBreaking NewsTOP STORIESతెలంగాణ

తెలుగు రాష్ట్రాలను కంటతడి పెట్టిస్తున్న కుటుంబం ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముంది..!

రెండు తెలుగు రాష్ట్రాలను సాఫ్టువేర్ ఇంజనీర్ విజయ రెడ్డి కుటుంబం ఆత్మహత్య సంఘటన కంటతడి పెట్టిస్తుంది. ఏం జరిగిందో ఏమో కానీ కుటుంబం ఆత్మహత్య సంఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలను కంటతడి పెట్టిస్తున్న కుటుంబం ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముంది..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

రెండు తెలుగు రాష్ట్రాలను సాఫ్టువేర్ ఇంజనీర్ విజయ రెడ్డి కుటుంబం ఆత్మహత్య సంఘటన కంటతడి పెట్టిస్తుంది. ఏం జరిగిందో ఏమో కానీ కుటుంబం ఆత్మహత్య సంఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ చదివే పిల్లలను హాస్టల్లో నుంచి తీసుకువచ్చి ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారంటే.. బలమైన కారణమే ఉంటుందని భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు అంత ధైర్యం చేసిన ఆ కుటుంబం.. బతికేందుకు ఎందుకు ధైర్యం చేయలేకపోయారా అనే విషయం ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది.

కుటుంబంలో కూడా ఎలాంటి గొడవలు లేవని, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని తెలుస్తుంది. జనవరి 30 అర్ధరాత్రి చర్లపల్లి రైల్వే స్టేషన్ కు ముగ్గులు కలిసి రావడం.. సీసీ విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు. అయితే విజయశాంతి, సురేందర్ రెడ్డిల పెళ్లిరోజు జనవరి 28వ తేదీ అని, జనవరి 31 వ తేదీన సురేందర్ రెడ్డి పుట్టినరోజు అని కూడా పోలీసుల విచారణలో తెలిసింది. అయితే పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఏదో బలమైన కారణం లేకుండా ఇంతటి ఘటనకు దారి తీసే పరిస్థితి ఏముంటుందో అని ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది.

సోషల్ మీడియాలో చర్చ

చర్లపల్లి రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడిన విజయశాంతి రెడ్డి కుటుంబం గురించి సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. తనతో పాటు పిల్లలను తీసుకెళ్ళిందంటే ఎంతటి బలమైన కారణం ఉంటుందో.? అని పిల్లలను ఆత్మహత్యకు మోటివేట్ చేసిన ఆమె బ్రతికేందుకు ఎందుకు చేయలేకపోయిందనేది చర్చ కొనసాగుతుంది. ఒంటరితనం కారణంగానే ఆమె ఇలా చేసిందా అనే చర్చ సాగుతుంది. ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి నిర్ణయానికి వచ్చి ఉండవచ్చునని కొంతమంది పేర్కొంటున్నారు. ఏది ఏమైనా బతికి సాధించాలని.. చావుతో ఎలాంటి సమస్యలు పరిష్కారం కావని నిటిజన్లు పేర్కొంటున్నారు.

సూసైడ్ నోట్లో ఏముంది..?

సూసైడ్ కు ముందు కారు పార్కింగ్ స్లిప్ పైన రాసినట్లుగా తెలుస్తుంది. సూసైడ్ నోట్లో ఐ యాం సారీ అమ్మ నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు. చాలా ట్రై చేశా బతకడానికి కానీ అవ్వట్లేదు. నా పిల్లలని వదిలేసి నేను పోలేను. అందుకే వాళ్ళని తీసుకొని పోతున్న. మా చావుకు ఎవరు కారణం కాదు. మా ఇష్టంతోనే పోతున్నాం. అని రాసిన లేక చూసి ప్రతి ఒక్కరు కంటనీరు పెడుతున్నారు.

MOST READ 

  1. Tragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

  2. MGU : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో  భోజనములో గుట్కా ప్యాకెట్.. విద్యార్థుల ఆందోళన..!

  3. Hyderabad : ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు.. రూ.6 లక్షలు చోరీ, సీసీటీవీలో రికార్డు..!

  4. Miryalaguda : 4న మిర్యాలగూడకు రేవంత్ రెడ్డి రాక.. గూడూరు వద్ద బహిరంగ సభ..!

మరిన్ని వార్తలు