తండ్రి గెలుపు కోసం తనయుని ప్రచారం..!

మిర్యాలగూడ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గెలుపు కోసం ఆయన తనయుడు ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మంగళవారం దామరచర్ల మండలం కొండ్రపోలు, రాళ్ళవాగుతండా తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తండ్రి గెలుపు కోసం తనయుని ప్రచారం..!

ప్రజలతో మమేకమవుతున్న నల్లమోతు సిద్ధార్థ

మిర్యాలగూడ టౌన్,  మన సాక్షి:

మిర్యాలగూడ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గెలుపు కోసం ఆయన తనయుడు ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మంగళవారం దామరచర్ల మండలం కొండ్రపోలు, రాళ్ళవాగుతండా తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆయా గ్రామాల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలందరితో మమేకమవుతూ…గ్రామాల్లో తండాల్లో జరిగిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల అమలు గురించి వివరించారు.కరపత్రాలు పంపిణీ చేశారు. మళ్లీ అధికారంలోకి కేసిఆర్ ప్రభుత్వమే వస్తుందన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు..!

కేసీఆర్ ప్రభుత్వంలోని 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరిగిందన్నారు.కాంగ్రెస్ హయాంలోనే కరెంట్ కష్టాలు వచ్చినాయి. జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించడానికి మరోసారి కేసీఆర్ ప్రభుత్వాని గెలిపించాలన్నారు. ఈనెల 30న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి,ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

ALSO READ : Elections : ఎన్నికల్లో ఓటు వేస్తారా.. ఆ సెకండ్లే కీలకం.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!