తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
Devarakonda : భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి వేడుకలు..!
Devarakonda : భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి వేడుకలు..!
చింతపల్లి, మనసాక్షి.
ప్రతి ఒక్కరు మహా శివుని అనుగ్రహం పొందాలని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామవత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం డిండి మండల శేషాయికుంట గ్రామంలో తొలి ఏకాదశి సందర్భంగా శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత నెలకొంటుందనివారన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొ ని, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు రవీంద్ర కుమార్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వీరి వెంట డిండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజ నేను వెంకటేశ్వరరావు, పిఎసి ఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాసరావు, కృష్ణయ్య, జి శ్రీను, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
MOST READ :









