Nelakondapalli : స్థలం వివాదంలో.. ఆగిన అంత్యక్రియలు..!
Nelakondapalli : స్థలం వివాదంలో.. ఆగిన అంత్యక్రియలు..!
నేలకొండపల్లి, మన సాక్షి :
స్థల విషయంలో బంధువుల మధ్య వివాదం అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని పైనంపల్లి లో బుధవారం మారగాని కోటమ్మ (60) అనే వృద్ధురాలి మృతి చెందింది. కాగా మృతదేహం ను ఓ స్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
విషయం తెలుసుకుని వారి బంధువులు ఘటనా స్థలం కు చేరుకున్నారు. అప్పటికే బంధువులు ఆ స్థలంలో ఉన్న రాళ్ల ను తొలిగించి అంత్యకియలకు నిమగ్నమయ్యారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అంత్యక్రియలను అడ్డుకున్నారు. స్థలం మాదంటే… మాదని రెండు వర్గాలు వారు పటుబటారు.
చివరకు పోలీసేసేషన్ కు ఇరువ వర్గాలు చేరుకుని హల్చల్చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల తో చర్చించి స్థల వివాదం తరువాత చూసుకోవచ్చు… ఆ ప్రాంతంలో దేవాలయం ఉన్నందున్న అంత్యక్రియలు చేయవద్దని సూచించారు. పోలీసుల సూచనలతో అంత్యక్రియలను సాయంత్రం శ్మశాన వాటికలో చేయించారు.
MOST READ :









