Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : తాళం వేసిన గంటకే ఇల్లు ఖాళీ.. దేవరకొండలో పట్టపగలే చోరీ..!

BREAKING : తాళం వేసిన గంటకే ఇల్లు ఖాళీ.. దేవరకొండలో పట్టపగలే చోరీ..!

దేవరకొండ, మనసాక్షి :

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణం అయ్యప్ప నగర్ లో ఒక ఇంట్లో తాళాలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. తాళం వేసిన గంటల వ్యవధిలోనే దొంగతనాలు జరగడం విశేషం. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్

ఇంటికి తాళం వేసి శనివారం నాడు యధావిధిగా మధ్యాహ్నం సమయంలో గ్రామానికి వెళ్లి అక్కడ పనులు చూసుకొని సాయంత్రం ఐదు గంటల సమయంలో పట్టణానికి ఇంటికి వచ్చి చూడగా.. దుండగులు చోరీకి పాల్పడి… తులం నర బంగారం, 30 తులాల వెండి, రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

ఈ సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండ అయ్యప్ప నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండడంతో విష్ణువర్ధన్ రెడ్డి బీరువా తీసి చూడగా తులం నారా బంగారం, 30 తులాల వెండి, రెండు లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితులు గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దేవరకొండ ఎస్సై అజ్మీరా రమేష్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అజ్మీర రమేష్ తెలిపారు.

ఐదు,ఆరు నెలల నుంచి దొంగలు దేవరకొండ పట్టణంలో వరుసగా బీభత్సం సృష్టిస్తున్నడం వలన పట్టణంలో ప్రజలు భయం భయంగా ఉంటున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టపగలే దేవరకొండ పట్టణంలో చోరీలకి పాలుపడుతున్న దుండగులను పట్టుకోవాలని ప్రజలు పోలీస్ లను కోరారు.

MOST READ : 

మరిన్ని వార్తలు