Nagarjunasagar : నాగార్జునసాగర్ లోని బుద్ధవనం చేరిన కేరళ దమ్మయాత్ర బృందం..!
Nagarjunasagar : నాగార్జునసాగర్ లోని బుద్ధవనం చేరిన కేరళ దమ్మయాత్ర బృందం..!
నాగార్జునసాగర్, మన సాక్షి :
కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన అశోక, అంబేద్కర్ దమ్మయాత్ర బృందం సభ్యులు ప్రపంచ శాంతి, బంధుత్వన్ని కోరుతూ శనివారం నాడు బృందం నాగార్జునసాగర్ లోని బుద్ధవనం చేరుకుంది. ఈ బృందానికి తెలంగాణ రాష్ట్రం తరఫున పూజ్య బిక్కు సద్దా రక్కిత సాదర స్వాగతం పలికి బౌద్ధం పరుడ విళ్ళిన, విజయపురి నేటి నాగార్జునసాగర్ బుద్ధవనానికి ఆహ్వానించారు.
ఈ బృందం సభ్యులు ముందుగా బుద్ధ భగవానుని పాద పద్మాల వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపారు. అనంతరం బుద్ధ వనంలోని మహా స్తూపం లో అత్యంత పవిత్రంగా భావించబడుతున్న బుద్ధ భగవానుని బండాగారాన్ని సందర్శించి అక్కడ ధ్యానం చేశారు. అనంతరం బుద్ధ వనంలోని శ్రీలంక దేశం భిక్షువులు ఏర్పాటుచేసిన ఆచార్య అవకాన బుద్ధుని నిలువెత్తు విగ్రహాన్ని సందర్శించి పూజలు చేశారు.
బుద్ధ వనంలో ఏర్పాటుచేసిన ఆయా దేశాలకు చెందిన బుద్ధుని కళాఖండాలను సందర్శించి బుద్ధవనం విశేషాలను ఇక్కడి గైడ్ ల ద్వారా తెలుసుకొని ఆనందించారు. ఈ సందర్భంగా నేషనల్ బుద్దిస్ట్ పేటర్నాటి సొసైటీ కౌన్సిల్ పూజ్య మౌర్య బౌద్ధ బిక్కు భారతీయ ప్రభు మాట్లాడుతూ ఈ యాత్ర కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నుండి బయలుదేరి దీక్ష భూమి నాగపూర్ చేరుకుంటుందని అక్కడ అశోక విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా వారు తెలిపారు.
ప్రపంచ శాంతి, ప్రపంచ బంధుత్వం నినాదంతో ఈ యాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ బృందంలో దమ్మ కమిటీ సభ్యులు దమ్మా ధర్మేంద్రన్, ఉపాసకులు రాజేంద్రన్, కేరళ రాజగోపాలన్, తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
LATEST UPDATE :
-
Rythu Bharosa : రైతు భరోసా కోసం ఎదురుచూపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం, డబ్బులు పడేది అప్పుడే..!
-
PONGULETI : దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా, త్వరలో నూతన రెవెన్యూ చట్టం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!
-
District collector : డిజిటల్ సర్వేలో ఒక్క ఇంటిని కూడా వదలొద్దు.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
DSC : డీఎస్సీ అభ్యర్థులకు ఫోన్ చేయాల్సిందే.. జిల్లా కలెక్టర్..!
రిపోర్టింగ్ : రాజ్యలక్ష్మి, నాగార్జునసాగర్









