Suryapet : ఆరోగ్య ఉప కేంద్రానికి ఇంటి యజమాని తాళం.. రెండేళ్లుగా అద్దె చెల్లించని వైనం..!
అద్దె చెల్లించకపోవడంతో ఆరోగ్య ఉప కేంద్రానికి యజమాని తాళం వేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది

Suryapet : ఆరోగ్య ఉప కేంద్రానికి ఇంటి యజమాని తాళం.. రెండేళ్లుగా అద్దె చెల్లించని వైనం..!
తుంగతుర్తి మన సాక్షి :
తుంగతుర్తి మండల కేంద్రం లోని ఎస్సీ కాలనీలో గల ఆరోగ్య ఉపకేంద్రం నెలకు 2000 చొప్పున గత రెండు సంవత్సరాల నుంచి సుమారు 48 వేల రూపాయలు కట్టకపోవడంతో సబ్ సెంటర్కు యజమాని తాళం వేసి నిరసన తెలుపడంతో ఆరోగ్య సిబ్బంది మన సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ కాలనీతో సబ్ సెంటర్ ప్రారంభించినప్పుడు సంబంధిత స్థానిక డాక్టర్లు రెంటు చెల్లిద్దామని చెప్పి రెండు సంవత్సరాలు గడిచిన నేటి వరకు ఎటువంటి రెండు ఇవ్వకపోవడంతో సంబంధిత యజమాని గడిచిన వారం రోజులుగా తాళం వేసినట్లు తెలిపారు.
అందులో పనిచేసినట్లు సిబ్బందికి 8 నెలలు గడిచిన పూర్తి స్థాయిలో జీవిత పద్యాలు రాకపోవడం గమనార్ధం స్థానిక ఎమ్మెల్యే మందుల స్వామీ పెద్ద మనసుతో గ్రహించి తుంగతుర్తి మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ బిల్డింగును సబ్ సెంటర్ కి ఇచ్చే విధంగా కృషి చేయాలని వారు కోరుతున్నారు.
సబ్ సెంటర్ ఇంటి అద్దె డబ్బులను జిల్లా అధికారులు మా సమస్యను తెలుసుకొని చాలా నెలలు గడిచినప్పటికీ అద్దె డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంటి యజమాని కిరాయి డబ్బుల కోసం తాళం వేసి మమ్ములను బయటికి పంపించారు. ఇక మేము ఎటు తోయలేక కొన్ని పత్రికల జర్నలిస్టు సోదరులకు మా మోర తెలుపడం జరిగిందన్నారు.
MOST READ
-
Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో BRS జోష్.. వార్డుల అభ్యర్థుల జాబితా విడుదల..!
-
Miryalaguda : మిర్యాలగూడలో రెండవ రోజు 176 నామినేషన్లు..!
-
Medaram : జాతర కీలక ఘట్టం ఆవిష్కృతం.. కన్నెపల్లి నుంచి గద్దెపైకి కొలువు తీరిన సారలమ్మ..!
-
Gold Price : ఒక్కసారిగా సీన్ రివర్స్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర..!









