Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో BRS జోష్.. వార్డుల అభ్యర్థుల జాబితా విడుదల..!

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో BRS జోష్.. వార్డుల అభ్యర్థుల జాబితా విడుదల..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెడ్డి కాలనీలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు.

మొత్తం 48 వార్డులకు గాను 38 వార్డుల బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అధికారికంగా విడుదల చేశారు. అనంతరం, ప్రకటించిన అభ్యర్థులకు ఎన్నికల నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ.. “మిర్యాలగూడ పట్టణాన్ని గత పదేళ్లలో అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపామని, చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని ప్రజలను కోరుతున్నాం. పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేసే వారికే ఈసారి అవకాశం కల్పించాం. అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. మిగిలిన స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం” అని స్పష్టం చేశారు.

మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో గులాబీ జెండా ఎగిరేలా సమిష్టిగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహ రెడ్డితో పాటు, యువనేత నల్లమోతు సిద్ధార్థ పాల్గొని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రెస్ మీట్‌లో బీఆర్‌ఎస్ నాయకులు యదవెల్లి శ్రీనివాస్ రెడ్డి, అన్నభిమోజు నాగార్జున చారి,

నారాయణ రెడ్డి, వీరకోటి రెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, కరుణాకర్ రెడ్డి, బాబయ్య, మక్డుం పాషా, ఇలియాజ్, మాజిద్, కట్టా మల్లేష్ గౌడ్, పిస్కే ప్రసాద్, బిక్షం గౌడ్, అశోక్ రెడ్డి, హతిరాం నాయక్, బాలు నాయక్, కోలా రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి

  1. KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ లో చేరికలు..!

  3. TG News : ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు..!

  4. Gold Price : భారీగా పెరిగిన బంగారం ధర.. ఆల్ టైం రికార్డ్.. మరింత ధర పెరిగేనా..!

మరిన్ని వార్తలు