Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District Collector : కుటుంబ సర్వే డాటా ఎంట్రీలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండరాదు.. జిల్లా కలెక్టర్..!

District Collector : కుటుంబ సర్వే డాటా ఎంట్రీలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండరాదు.. జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఫారాలలోని వివరాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం ఆమె జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం, ఎంపీడీవో కార్యాలయాల్లో కొనసాగుతున్న డాటా ఎంట్రీని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాటా ఎంట్రీలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండరాదని, ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని కుటుంబాల వివరాలను కంప్యూటర్లో నమోదు చేయాలని చెప్పారు. డాటా ఎంట్రీ కి అవసరమైన కంప్యూటర్లు, ల్యాబ్ ట్యాప్ లను సమకూర్చుకోవాలన్నారు.

డాటా ఎంట్రీ సమయంలో ఎన్యూమరేట్ అందుబాటులో ఉండాలన్నారు. వార్డులు, గ్రామాల వారీగా సర్వే పూర్తయిన ఫారాలను ఎక్కడ భద్ర పరిచారని అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఫారాలు బయట ఎక్కడా కనిపించరాదని, సర్వే పూర్తయిన ఫారాల వివరాలను కంప్యూటర్ లో నమోదు చేశామని, ఇక వాటితో పని లేదని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా భద్ర పరచాలన్నారు.

నమోదు ప్రక్రియ ను ఉదయం నుంచి రాత్రి వీలైనంత వరకు కొనసాగించాలని, డాటా ఎంట్రీ కి సంబంధించి ఆపరేటర్లకు రెమ్యూనరేషన్ ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఎంపీడీవో కార్యాలయoలో నమోదును పరిశీలించిన కలెక్టర్ గ్రామీణ ప్రాంతాల డాటా ఎంట్రీ స్పీడ్ అప్ చేయాలన్నారు.

వీలైనన్ని కంప్యూటర్లు, ల్యాబ్ ట్యాప్ లను సమకూర్చుకుని స్థానిక చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటుచేసి సర్వే ఫారాల డాటా ఎంట్రీని ఈ నెలాఖరు వరకు నిర్విరామంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, ఎంపీడీవో సుదర్శన్ పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు