Gang Arrest : ట్రాక్టర్‌ ట్రాలీల చోరీల ముఠా అరెస్టు

ఒక్క ట్రాక్టర్‌ ట్రాలీ దొంగతనం కేసులో కేసు నమోదు చేసుకున్న పుల్కల్‌ పోలీసులు విచారణ జరుపగా, గత ఆరు మాసాల క్రితం నుంచి చోరీకి గురైన ఆరు ట్రాక్టర్‌ ట్రాలీలల దొంగలను గుర్తించి అరెస్టు చేశారు.

Gang Arrest : ట్రాక్టర్‌ ట్రాలీల చోరీల ముఠా అరెస్టు

ఆరుగురు నిందితులకు రిమాండ్‌

విలేకరుల సమావేశంలో జోగిపేట సీఐ అనిల్‌కుమార్‌

అందోలు, మనసాక్షిః

ఒక్క ట్రాక్టర్‌ ట్రాలీ దొంగతనం కేసులో కేసు నమోదు చేసుకున్న పుల్కల్‌ పోలీసులు విచారణ జరుపగా, గత ఆరు మాసాల క్రితం నుంచి చోరీకి గురైన ఆరు ట్రాక్టర్‌ ట్రాలీలల దొంగలను గుర్తించి అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి జోగిపేటలోని పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ అనిల్‌కుమార్, పుల్కల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

సెప్టెంబర్‌ 1వ తేదిన చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన బండ్ల విట్టల్‌ రెడ్డికి చెందిన ట్రాక్టర్‌ ట్రాలీ వ్యవసాయం భూమి వద్ద నుంచి గుర్తు తెలియని దొంగలు దొంగిలించినారని పుల్కల్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పుల్కల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తును ప్రారంభించారు.

ALSO READ : Zero bills for home electricity : గృహ విద్యుత్ కు ఇక జీరో బిల్లులు, ఎప్పటినుంచంటే.. ఆదేశించిన రేవంత్ రెడ్డి..!

ఫిబ్రవరి 23వ తేదిన ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు పుల్కల్‌ ఎస్‌ఐ నేతృత్వంలో సిబ్బంది ముదిమాణిక్యం చౌరాస్తా వద్ద వాహనాలను తనిఖి చేస్తుండగా ఒక ట్రాక్టర్‌ ఇంజిన్‌ పై ఆరుగురు వ్యక్తులు వస్తూ పోలీస్‌లను పారిపోతుండగా వెంబడించి పట్టుకొని విచారించగా సుల్తాన్‌ పూర్, చౌటకుర్‌ మండలం లోని శివ్వంపేట, సంగారెడ్డి మండలం లోని ఇరిగిపల్లి, వెండికోల్, జిన్నారం మండలం లోని సోలక్‌ పల్లి గ్రామములోని మొత్తం ఆరు ట్రాక్టర్‌ ట్రాలీలను దొంగిలించి నట్లు ఒప్పుకున్నారు.

ట్రాలీ లను నేరస్తుల నుండి స్వాదినపరుచుకున్నట్లు తెలిపారు. స్వాధీనరచుకున్న రికవరీ సొత్తు విలువ సుమారుగా రూ.8.10 లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ కేసుల్లో ∙శివ్వంపేట గ్రామానికి చెందిన అలకుంట నరేష్, సత్తి రాజీవ్, ల్యాగల రవికుమార్, వడ్డే శ్రీను, వడ్డే కుమార్, బండారి రవిలపై కేసు నమోదు చేసి, శుక్రవారం కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు సీఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.

ALSO READ : BIG BREAKING : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..!