తుఫాన్ కారణంగా నేల పాలైన మిర్చి తోటలు..!

గత రెండు రోజులుగా ఎడతెరప లేకుండా కురుస్తున్న ఈ మీచౌoగ్ తుఫాన్ ఆకాలవర్షం కారణంగా చర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల మిర్చిరైతులకు ఈ మీచౌoగ్ తుఫాన్ ఊహించని నష్టాన్ని చేకూర్చింది.

తుఫాన్ కారణంగా నేల పాలైన మిర్చి తోటలు..!

గుండెల నిండా బాధతో రైతన్నలు.

చర్ల, మనసాక్షి:

గత రెండు రోజులుగా ఎడతెరప లేకుండా కురుస్తున్న ఈ మీచౌoగ్ తుఫాన్ ఆకాలవర్షం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల మిర్చిరైతులకు ఈ మీచౌoగ్ తుఫాన్ ఊహించని నష్టాన్ని చేకూర్చింది. పంట నష్టానికి గురైన మిర్చి రైతులు మాట్లాడుతూ ఈ తుఫాన్ రావడంతో మా రైతులకు ఎలాంటి లాభం లేదని మిర్చి పంటల మీద ఇప్పటికే ఎకరానికి సుమారు మూడు లక్షల వరకు ఖర్చు పెట్టి ఉన్నామని అన్నారు.

దాని ఫలితంగానే చెట్టుకు ఇప్పుడిప్పుడే పిందా, పూత, మొదలై కాపు కాస్తున్న ఈ సమయం లో తుఫాన్ పేరిట బారి వర్షాలు రావడం తో మా మిర్చి తోటలు మొత్తం నేల పాలై బురధలో కురుకుపోవడం జరిగిందని వారు ఆవేదన చెందారు.

ALSO READ : BREAKING : పేరంటాల చెరువు, మల్లెపువ్వు కాలవలకు గండి

ఆరుగాలం కష్టం చేసుకొని కంటికి రెప్పలా కాపాడుకునే తోటలు ప్రకృతి సహకరించక కళ్ళముందే నాశనం అవ్వుతుంటే తట్టుకోలేని పరిస్థితులలో కనీళ్ళే మిగిలాయని అన్నారు.ఇప్పటికే మిర్చి తోటలో చెట్లు చాలా చనిపోవడం జరిగిందని అన్నారు.

ఇలా జలమయం అయ్యిన తోటల్లో పంటకి ఎర్ర తెగులు, చుక్క తెగులు, విపరీతమైన ముడత, మొక్క మొదట్లో కుళ్ళుడు, బొల్లె రావడం,మిర్చి కాయలపై చుక్క తెగులు రావడం వంటి,వ్యాధులు ఎక్కువగా రావడం జరిగి పూత, కాపు,తో ఉన్న చెట్లు చనిపోవడం జరుగుతుందని వారు తెలిపారు.తద్వారా పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులపాలు అయ్యే అవకాశాలు చాలా మెండుగా వుంటాయని బాధిత రైతులు అన్నారు. ప్రకృతి సైతం రైతులకు సహకరించట్లేదని వారు వాపోయారు.

ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!