అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లు సీజ్..!

ప్రభుత్వ భూమి నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేసినట్లు ఎస్ ఐ జి అజయ్ కుమార్ తెలిపారు.

అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లు సీజ్..!

నడిగూడెం, మన సాక్షి :

ప్రభుత్వ భూమి నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేసినట్లు ఎస్ ఐ
జి అజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని రామాపురం రెవిన్యూ పరిధిలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 190 లో అక్రమంగా మట్టిని త్రవ్వి తరలించుకొని వెళ్తున్నారు.

విశ్వసనీయ సమచారం మేరకు మండల రెవెన్యూ సిబ్బంది వెళ్లి 4 టిప్పర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా 4 టిప్పర్ లను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో అక్రమంగా మట్టిని, ఇసుకను తరిలించిన వారి పైన చట్ట పరమైన చర్యలు ఉంటాయన్నారు.

ALSO READ : Miryalaguda : అంతర రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..!